Karthika Deepam Fame Premi Viswanath Play A Key Role In Naga Chaitanya 22 Movie - Sakshi
Sakshi News home page

Premi Viswanath: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, NC22లో కీ రోల్‌

Published Fri, Oct 14 2022 3:21 PM | Last Updated on Fri, Oct 14 2022 4:09 PM

NC22: Karthika Deepam Fame Premi Viswanath Plays Key Role Naga Chaitanya Movie - Sakshi

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘మానాడు’ ఫేమ్‌ వెంకట్ ప్రభు దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తోన్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. NC22 అనే వర్కింగ్‌ టైటిల్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నటీనటులను పరిచయం చేస్తున్నారు మేకర్స్‌. ఇప్పటికే ఈచిత్రంలో లెజెండరి నటుడు శరత్‌ కుమార్‌, నటి ప్రియమణి, కమెడియన్‌ వెన్నెల కిషో, సంపత్‌ రాజా వంటి స్టార్‌ నటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

చదవండి: ‘బాహుబలి’ ఆఫర్‌ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి

తాజాగా ఇందులో బుల్లితెర క్వీన్‌, నటి ప్రేమి విశ్వనాథ్‌(కార్తిక దీపం సీరియల్‌ ఫేం దీప) కూడా నటిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో ఆమె ఓ కీ రోల్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమి విశ్వనాథ్‌కు సెట్‌లోకి స్వాగతం పలుకుతూ తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. ఈ మేరకు వెల్‌కమ్‌ ఆన్‌బోర్డ్‌ అంటూ ప్రేమి విశ్వనాథ్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. కాగా ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement