నాగచైతన్య సినిమాపై సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన మేకర్స్‌ | NC22: Naga Chaitanya To Begin Shooting For Venkat Prabhu Film | Sakshi
Sakshi News home page

Naga Chaitanya : నాగచైతన్య సినిమాపై సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన మేకర్స్‌

Published Tue, Sep 20 2022 3:46 PM | Last Updated on Tue, Sep 20 2022 3:48 PM

NC22: Naga Chaitanya To Begin Shooting For Venkat Prabhu Film - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం ధూత అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న చై ఆ సినిమా కంప్లీట్‌ కాకుండగానే నెక్స్ట్‌ సినిమాను పట్టాలెక్కించాడు. మానాడు చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ స్టార్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చై కెరీర్‌లోనే ఇది 22వ సినిమా.

తాజాగా ఈ సినిమాపై మేకర్స్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. రేపు(బుధవారం)ఈ  సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు పోస్టర్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో చై పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించనుంది. 'బంగార్రాజు' తర్వాత మరోసారి ఈ జోడీ రిపీట్‌ కానుండటంతో ఆసక్తి నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement