నాగచైతన్య, కృతి శెట్టి కాంబినేషన్‌లో కొత్త చిత్రం.. పేరేంటో తెలుసా..! | Naga Chaitanya Shares His Next Film Update IN Twitter | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: నాగచైతన్య, కృతి శెట్టి జోడిగా కొత్త చిత్రం .. షూటింగ్ ఎప్పుడంటే..!

Published Tue, Sep 20 2022 9:45 PM | Last Updated on Wed, Sep 21 2022 2:07 PM

Naga Chaitanya Shares His Next Film Update IN Twitter - Sakshi

అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా తదుపరి చిత్రం అప్‌డేట్ వచ్చేసింది.  నాగచైతన్య తన 22వ సినిమాను దర్శకుడు వెంకట్‌ ప్రభుతో చేయనున్నారు. ఈ సినిమాను రెండు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'NC22' అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభం కానుంది.

ఈ విషయాన్ని నాగచైతన్య ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. నాగచైతన్య కనిపిస్తున్న ఓ ఫొటోను షేర్‌ చేస్తూ ‘షూటింగ్‌ రేపటి నుంచి మొదలుకానుంది’ అంటూ చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవ్వనున్న ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. మేకర్స్ నాగ చైతన్య అద్భుతమైన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.  ఈ పోస్టర్‌లో నాగచైతన్య లుక్ రివీల్ చేయలేదు చిత్రబృందం. దీంతో అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.  ఆమిర్‌ఖాన్‌తో కలిసి అక్కినేని నాగచైతన్య నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement