Krithi Shetty Baggs One More Project, Pairs Up With Naga Chaitanya - Sakshi
Sakshi News home page

Krithi Shetty: బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్న బేబమ్మ, అప్పుడే మరో ఛాన్స్‌ కొట్టేసిందిగా!

Published Thu, Jun 23 2022 4:25 PM | Last Updated on Sat, Jun 25 2022 4:26 PM

Krithi Shetty Baggs One More Project, Pairs Up With Naga Chaitanya - Sakshi

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు కొంత లక్‌ కూడా ఉండాలి. ఈ రెండూ తోడైతే మాత్రం వారిని ఆపడం ఎవరితరమూ కాదు. ప్రస్తుతం కృతీశెట్టికి గోల్డెన్‌ టైం నడుస్తోంది. తొలి చిత్రం ఉప్పెనతోనే హిట్‌ అందుకున్న ఈ సొట్టబుగ్గల సుందరికి వరుసగా సినిమా ఛాన్స్‌లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె రామ్‌తో 'ది వారియర్‌', సుధీర్‌ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్‌తో 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమెను మరో బంపర్‌ ఆఫర్‌ వరించింది. నాగచైతన్య 22వ సినిమాలో కథానాయికగా నటించనుంది. 

తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఈ సినిమాలో కృతీ శెట్టిని ఎంపిక చేసినట్లు చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. పోలీస్‌ స్టేషన్‌లో ఉండే ఫైల్స్‌ తరహాలో కృతీ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రాన్ని పవన్‌ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

చదవండి: పది మంది పిల్లలు, నటికి మీడియా మొఘల్‌ విడాకులు!
 డైరెక్టర్‌ లింగుస్వామికి రామ్‌ క్షమాపణలు, ఏం జరిగిందంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement