
కీర్తీ సురేశ్
‘మహానటి’ సూపర్ సక్సెస్ తర్వాత ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు కీర్తీ సురేశ్. తమిళంలో విక్రమ్‌తో చేస్తున్న ‘సామి స్క్వేర్’, విశాల్‌తో చేస్తున్న ‘సండై కోళి 2’ (పందెం కోడి 2).. ఈ రెండూ కూడా ‘మహానటి’కి ముందు కమిట్ అయిన సినిమాలే. ఈ రెండు సినిమాల తర్వాత ఏంటి? అంటే.. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త ప్రకారం శింబుతో దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేశ్ పేరును పరిశీలిస్తున్నారట. ఈ చిత్రానికి ‘అదిరడి’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఒకవైపు చెన్నై ఫిల్మ్‌నగర్‌లో టైటిల్, హీరోయిన్ గురించి జోరుగా వార్తలు షికారు చేస్తుంటే, దర్శకుడు వెంకట్ ప్రభు మాత్రం ‘‘టైటిల్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. టైటిల్ మాత్రం ‘అదిరడి’ కాదు. కొత్త టైటిల్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది’’ అని పేర్కొన్నారు.