
శింబు
తమిళ యంగ్ హీరో శింబుకు ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ హిట్‌తో శింబు వరుసగా కొత్త సినిమాలు సైన్ చేస్తున్నారు. సుందర్ సి. తో ‘అత్తారింటికి దారేది’ రీమేక్‌లో నటిస్తున్నారు. తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో కనిపించనున్నారు. అందులో పాత్రకు సంబంధించి శింబు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోనున్నారట. అందుకోసం బ్యాంకాక్‌లో దాదాపు నెలరోజులు గడపనున్నారట. మార్షల్ ఆర్ట్స్ బేసిక్స్ అన్నీ నేర్చుకుంటారని కోలీవుడ్ టాక్. ‘మానాడు’ చిత్రం మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment