Thalapathy Vijay To Charge Rs 200 Crore For Venkat Prabhu’s Next? - Sakshi
Sakshi News home page

Thalapathy Vijay: దళపతి విజ‍య్.. రెమ్యునరేషన్ ఏకంగా రూ.200 కోట్లా!

Published Sat, May 20 2023 3:22 PM | Last Updated on Sat, May 20 2023 3:57 PM

Thalapathy Vijay becomes highest paid Indian actor, charges Rs 200 crores for next with Venkat Prabhu - Sakshi

దళపతి విజయ్ సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా కోలీవుడ్‌లో అగ్ర హీరోగా గుర్తింపు పొందారు. ఇంక ఆయనతో సినిమా తీసేందుకు డైరెక్టర్లు సైతం క్యూ కడతారు. అయితే ప్రస్తుతం ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లియో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్,  గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా, మిస్కిన్, ప్రియా ఆనంద్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 

(ఇది చదవండి: కస్టడీ డైరెక్టర్‌తో విజయ్‌ నెక్స్ట్‌ మూవీ?)

అయితే ఈ సినిమా తర్వాత విజయ్.. కస్టడీ మూవీ దర్శకుడు వెంకట్ ప్రభుతో జతకట్టనున్నట్లు సమాచారం.  తన తదుపరి చిత్రం కోసం ఆయనతో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రం కోసం విజయ్ దాదాపు రూ.200 కోట్లు రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. 

ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారం రానుందని సమాచారం. అదే నిజమైతే ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే తొలి భారతీయ నటుడిగా విజయ్ నిలుస్తాడు. అయితే గతంలో మాస్టర్ మూవీ కోసం విజయ్ రూ. 80 కోట్లు వసూలు చేశాడు.

(ఇది చదవండి: మంచి జోడీ కోసం వెతుకుతున్నా: సమంత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement