
కాజల్ అగర్వాల్
చాలెంజ్‌లకు, కొత్త కొత్త విషయాలకు నేనెప్పుడూ సిద్ధం అంటారు కాజల్ అగర్వాల్. ఇప్పుడు అలాంటి కొత్త ప్రయాణాన్నే ప్రారంభించనున్నారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ప్రేక్షకుడికి వినోదం పంచడానికి సినిమా స్టార్స్ కొత్తకొత్త ప్లాట్‌ఫామ్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెబ్ వరల్డ్‌లోకి ప్రవేశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఈ వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.. తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు హాట్‌స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌లోనే కాజల్ నటించనున్నారట. పది ఎపిసోడ్స్‌తో తెరకెక్కనున్న ఈ సిరీస్ షూటింగ్‌ను ఆగస్ట్‌లో ఆరంభించి సెప్టెంబర్‌కు ముగిస్తారట. కాజల్ నటించిన ‘రణరంగం, కోమలి’ సినిమాలు ఆగస్ట్ 15న రిలీజ్ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment