ద్విభాషా చిత్రం... పరభాష స్ఫూర్తితో! | best director Venkat Prabhu | Sakshi
Sakshi News home page

ద్విభాషా చిత్రం... పరభాష స్ఫూర్తితో!

Published Sun, Nov 22 2015 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

ద్విభాషా చిత్రం... పరభాష స్ఫూర్తితో!

ద్విభాషా చిత్రం... పరభాష స్ఫూర్తితో!

 ఆ సీన్ - ఈ సీన్
 దక్షిణాది దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక శైలిని కలిగిన దర్శకుల్లో ఒకరు వెంకట్ ప్రభు. స్పోర్ట్స్ కామెడీ అయిన తొలి సినిమా (చెన్నై 600028) తోనే డెరైక్టర్‌గా తన ప్రత్యేకత నిరూపించుకున్నాడు ఈ దర్శకుడు. అదే ‘సరోజ’ను రూపొందించాడు. యువన్ శంకర్‌రాజా కంపోజ్ చేసిన ఊపేసే సంగీతంతో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అంతటా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. అదే రివ్యూయర్లు ఈ సినిమాను ఒక హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రూపొందిం చారనే అంశాన్ని కూడా హైలెట్ చేశారు. అలాంటిదేమీ లేదని వెంకట్ ప్రభు చెప్పినా, తెలుగు తమిళ భాషల్లో వచ్చిన ఈ ద్విభాషా చిత్రం... ఒక పరభాషా చిత్రం ఆధారంగా రూపొందింది అన్నది వాస్తవం. 1993లో వచ్చిన హాలీ వుడ్ సినిమా ‘జడ్జిమెంట్ నైట్’ స్ఫూర్తితో ‘సరోజ’ రూపొందింది. ఈ రెండు సినిమాలకూ ఉన్న పోలికలే దీనికి సాక్ష్యం. 
 
 ‘సరోజ’ సినిమాలో నలుగురు హీరోలు ఉంటారు... శివ, వైభవ్ రెడ్డి, ప్రేమ్‌జీ అమరన్, ఎస్పీ చరణ్. వీళ్లు నలుగురూ క్రికెట్ మ్యాచ్ చూడటానికి చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలు దేరతారు. జడ్జిమెంట్ నైట్ సినిమాలోనూ నలుగురు హీరోలు. ఒక బాక్సింగ్ బౌట్‌ను తిలకించడానికి తమ నగరం నుంచి పక్కనే ఉండే మరో నగరానికి ప్రయాణం అవుతారు. గమనించదగ్గ అంశం ఏమిటంటే, రెండు సినిమాల్లోనూ హీరోలు ఒక డిఫరెంట్ కార్వాన్‌లోనే ప్రయాణిస్తారు. ‘సరోజ’ సినిమాలో ఎస్పీ చరణ్, వైభవ్‌రెడ్డి అన్నదమ్ములుగా నటించారు. హాలీవుడ్ సినిమాలో కూడా నలుగురు స్నేహితుల్లో ఇద్దరు అన్న దమ్ములే! ఎస్పీ చరణ్ చేసిన పాత్రకు పెళ్లై, ఒక పాప ఉంటుంది. జడ్జిమెంట్ నైట్‌లో కూడా ఆ పాత్ర నేపథ్యం అలాగే ఉంటుంది. 
 
  హైవే మీద ట్రాఫిక్ స్తంభించి పోవడంతో ఈ ప్రధాన పాత్ర ధారులు ప్రయా ణిస్తున వ్యాన్... దగ్గరి దారి అంటూ రోడ్డు నుంచి టర్న్ తీసుకోవడంతోనే కథ మలుపు తిరుగుతుంది. ఇలా మలుపు తిరిగిన ప్రయాణంలో వీళ్లకు తుపాకీ కాల్పులతో గాయపడ్డ ఒక వ్యక్తి తారస పడటం రెండు సినిమాల్లోనూ జరుగు తుంది. వీళ్లు ఒక హత్యకు సాక్షులు అవుతారు. ఆ హత్య చేసిన గ్యాంగ్ వీళ్లం దరినీ చంపేయడానికి ప్రయత్నిస్తుంది. ‘సరోజ’ సినిమాలోని ఈ ఎపిసోడ్స్ అన్నింటిలో ‘జడ్జిమెంట్ నైట్’ సినిమానే కనిపిస్తుంది. 
 
 విశేషం ఏమిటంటే రెండు చిత్రాల్లోని ప్రధాన భాగమంతా రాత్రి పూటే జరుగు తుంది. కిడ్నాపింగ్ గ్యాంగ్ ఆవాసంగా మార్చుకున్న భవనంలో అనుకోకుండా చిక్కుబడతారు స్నేహితులు. ఆ భవనంలో ఉంటూ కూడా వీళ్లు ఆ గ్యాంగ్ కంటపడ కుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంతా హాలీవుడ్ సినిమాలో ఉంటుంది. దాన్నే దర్శకుడు యథా తథంగా తీసుకున్నట్టనిపిస్తుంది. ప్రాణాలు పోతాయేమో అనిపించేంత భయంకర పరిస్థితుల్లో నలుగురు స్నేహితుల మధ్య భావోద్వేగాలు, ఒకరిని రక్షించుకోవడానికి మరొకరు పడే పాట్లు... రెండు సినిమా ల్లోనూ ఒకేలా ఉంటాయి. ఈ భావోద్వే గాలను యథాతథంగా ఆవిష్కరించడంలో వె ంకట్‌ప్రభు విజయవంతం అయ్యాడు. అయితే మిగతా విషయాల్లో ‘జడ్జిమెంట్ నైట్’... ‘సరోజ’ కన్నా ఎన్నో మెట్లు పైన ఉంటుంది. 
 
 ‘సరోజ’ సినిమాకు వెనుకా ముందు చాలా నేపథ్యాన్నే తయారు చేసు కున్నాడు దర్శకుడు. సొంతూరికి మేలు చేయ డానికి ధనికుడు అయిన తమ స్నేహితుడి కూతురినే (సరోజ) కిడ్నాప్ చేసే ఒక ముఠా, ఆ ముఠాకు సహయం చేసే పోలీసాఫీ సర్ (శ్రీహరి), అనుకో కుండా ముఠా చేతుల్లో పడి ముప్పు తిప్పలు పడి కిడ్నాప్ అయిన అమ్మా యిలను రక్షించే నలుగురు హీరోలు, వైభవ్ పాత్రకు కాజల్‌తో లవ్‌స్టోరీ... ఇలాంటి యాడింగ్స్ చేస్తూనే, అసలు కథ నేరేషన్‌కు మాత్రం ‘జడ్జిమెంట్ నైట్’ను ఆధారంగా చేసుకున్నాడు. అయితే వెంకట్‌ప్రభు మాత్రం ఈ విషయాన్ని అస్సలు ఒప్పుకోలేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా అడిగినా కాదని వాదించాడు. కానీ సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం ఇది కాపీనే అని స్పష్టమవుతుంది! 
 - బి.జీవన్‌రెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement