Best director
-
‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న ఈ మూవీ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు కొల్లగొడుతుంది. ఈ మూవీ డైరెక్టర్ ఓ హాస్యనటుడు కావడం విశేషం. వెండితెర, బుల్లితెరపై కమెడియన్‌గా అలరించిన వేణు యెల్డండిలీ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కేవలం మౌత్ టాక్‌తోనే బలగం మంచి వసూళ్లు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఒక సినిమా మంచి విజయం సాధించాలన్న, ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదని, కథ ఉంటే చాలని మరోసారి బలగం నిరూపించింది. కేవలం రూ. 2 కోట్లతో రూపొందిన ఈ మూవీ రూ. 25 కోట్లపైనే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఈ మూవీ వరుసగా అవార్డులను అందుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ మూవీ తాజాగా మరో అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ డైరెక్టర్ వేణు తొలిప్రయత్నంలోనే ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డును సాధించాడు. ఉత్తమ దర్శకుడిగా వేణు ఆమ్ స్టర్ డామ్ ఇంటర్నేషనల్ అవార్డుకు అందుకున్నాడు. కాగా ఇప్పటికే బలగం లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులు అందుకున్న ఈ మూవీకి మరో ఇంటర్నేషనల్ అవార్డు దక్కడం విశేషం. -
ఆస్కార్‌ను జయించింది
స్వీటీ... ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తరువాత ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహిస్తోన్న ‘ఉమెన్స్ ఫిల్మ్ యూనిట్’లో కొన్నేళ్లపాటు పాటు పనిచేసింది. లైంగిక దాడిపై కథను రాసి ‘ఆఫ్టర్ అవర్స్’ సినిమాను తీసింది. ఒకపక్క సినిమాలు తీస్తూనే టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. డ్యాన్సింగ్ డేజ్ అనే షో, ఎపిసోడ్ డైరెక్టర్‌గానూ, ఇతర షోల సీరీస్‌లను విజయవంతంగా నడిపించింది. జెయిన్ సినిమాల్లో మహిళ కేంద్రబింధువుగా ఉంటుంది. 1989లో తొలిసారి ‘స్వీటీ’ అనే ఫీచర్ ఫిల్మ్ తీసింది. ఈ సినిమా ఆద్యంతం మంచి కామెడీతో సాగడంతో ప్రేక్షకాదరణ పొంది అనేక అవార్డులను గెలుచుకుంది. బాల్యంలో దాదాపు చిన్నారులంతా అమ్మమ్మ, బామ్మ, తాతయ్యల దగ్గర కథలు వింటూ పెరుగుతారు. వయసు పెరిగే కొద్దీ చదువులు, ఆటల్లో పడిపోయి విన్న కథలను మర్చిపోతారు. పెద్దయ్యాక కెరీర్‌ను అందంగా మలుచుకోవడంలో మునిగిపోయి పూర్తిగా కథలను వదిలేస్తారు. అందరిలా చిన్నారి జెయిన్ చిన్నప్పుడు విన్న కథలను వదల్లేదు. అందరికంటే భిన్నంగా ఆలోచించే జెయిన్ తను విన్న కథలు, చదివిన కథలను మరింత లోతుగా ఊహించుకుంటూ పెరిగింది. పెద్దయ్యాక ఆ కథలకు తన ఊహా శక్తిని జోడించి ఏకంగా అవార్డు తెచ్చిపెట్టే సినిమాలు తీసి మంచి దర్శకురాలిగా ఎదిగింది. జెయిన్ మరెవరో కాదు.. రెండు సార్లు ఆస్కార్‌కు బెస్ట్ డైరెక్టర్‌గా నామినేట్ అయ్యి.. ఆదివారం జరిగిన ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్న మూడో మహిళా దర్శకురాలే 67 ఏళ్ల జెయిన్ క్యాంపియన్. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్లో 1954 ఏప్రిల్ 30న రిచర్డ్ క్యాంపియన్, ఎడిత్ ఆర్మ్‌స్ట్రాంగ్ దంపతులకు జెయిన్ క్యాంపియన్ జన్మించింది. రిచర్డ్ థియేటర్ డైరెక్టర్, ఎడిత్ నటి. వీరికి ముగ్గురు సంతానం. రెండో కూమార్తె జెయిన్ క్యాంపియన్ పూర్తిపేరు ఎలిజిబెత్ జెయిన్ క్యాంపియన్. చిన్నప్పుడు అందరిలా కథలు వింటూ పెరిగింది జెయిన్. స్కూల్లో ఉండగా అనేక కథల పుస్తకాలను చదివేది. ఇంట్లో సినిమా, నటనా వాతావరణం ఉండడంతో సహజంగానే నటన వైపు ఆకర్షితురాలైంది జెయిన్. కానీ నటనను కెరీర్‌గా ఎంచుకోలేదు. విక్టోరియా యూనివర్సిటీలో స్ట్రక్చరల్ ఆంథ్రోపాలజీలో డిగ్రీ పూర్తిచేసిన తరువాత పెయింటింగ్ ప్రధాన సబ్జెక్టుగా మరో డిగ్రీ చేసింది. డిగ్రీ చేసిన తరువాత తన ఆసక్తి దర్శకత్వంవైపు మళ్లింది. దీంతో వెనిస్ వెళ్లి ఆర్ట్స్‌లో కోర్సు చేసింది. తర్వాత లండన్‌లోని డాక్యుమెంటరీలు, కమర్షియల్ సినిమాలు తీసే ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. అసిస్టెంట్‌గా పనిచేస్తూనే చెల్సియా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదివింది. తరువాత సిడ్నీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. ఈ డిప్లొమా అయ్యాక సినిమా రంగంలో అడుగు పెట్టింది. 1980లో తొలిసారి ‘టిష్యూస్’ పేరిట ఓ లఘు చిత్రం తీసింది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో మరుసటి ఏడాది ఆస్ట్రేలియన్ ఫిల్మ్ టెలివిజన్, రేడియో స్కూల్లో చేరి రచయిత, దర్శకురాలు, ఎడిటర్‌గా అన్నీ తానై తండ్రి కొడుకుపై చూపించే క్రమశిక్షణ, బాధ్యతల్లో ఇద్దరు పడే సంఘర్షణను ‘పీల్’(1982) పేరిట సినిమా తీసింది. దీని తరువాత అమ్మాయిల ఫ్యాషన్‌పై రెండో సినిమా, అన్నా చెల్లెళ్ల బంధంపై మూడో సినిమాను నిర్మించింది. పీల్ సినిమాకు 1986లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘పామ్ డి ఓర్’ అవార్డు వచ్చింది. తొలిఆస్కార్ నామినేషన్ 1993లో ‘ద పియానో’ సినిమా తీసింది జెయిన్. ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ఫెస్టివల్ల్లో ‘పామ్ డీఓర్’ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకున్న తొలి మహిళగా జెయిన్ నిలిచింది. ఈ అవార్డుతోపాటు ‘బెస్ట్ యాక్టర్, బెస్ట్ సహాయ నటి’ అకాడమీ అవార్డులను ఈ సినిమా గెలుచుకోవడం విశేషం. ఈ సినిమాకు జెయిన్ ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ అవార్డుకి నామినేట్ అయినప్పటికీ, స్పీల్బర్గ్ బెస్ట్ డైరెక్టర్‌గా నిలవడంతో జెయిన్కు అవార్డు రాలేదు. కానీ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డు దక్కించుకుంది జెయిన్. జెయిన్ దర్శకత్వం వహించిన టాప్ ఫైవ్ సినిమాలలో.. ద పియానో, యాన్ ఏంజిల్ ఎట్ మై టేబుల్, బ్రైట్ స్టార్, స్వీటీ, ద పోర్టరేట్ ఆఫ్ ఏ లేడీలు ఉన్నాయి. ప్రస్తుతం రెండోసారి 94వ ఆస్కార్ అవార్డులకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు నామినేట్ అయ్యి ‘ద పవర్ ఆఫ్ ది డాగ్’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకుంది. తొలిసారి 2010లో క్యాథరిన్ బిగెలో ‘హర్ట్ లాకర్’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకుని తొలి మహిళా డైరెక్టర్‌గా రికార్డు సృష్టించింది. గతేడాది ‘నోమాడ్ ల్యాండ్’ సినిమాకు గాను క్లో జావో ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకోని రెండో మహిళగా నిలిచింది. ఇప్పుడు జెయిన్ మూడో బెస్ట్ డైరెక్టర్‌గా నిలిచారు. -
ఇద్దరు వనితల ఆస్కార్ చరిత్ర
ఆస్కార్ చరిత్రలోనే తొలిసారి ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో ఒకే ఏడాది ఇద్దరు మహిళలు నామినేట్ అయ్యారు! ‘నో మాడ్ల్యాండ్’, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’.. అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన క్లోయీ జావో, ఎమరాల్డ్ ఫెనెల్.. ఇద్దరూ నలభై ఏళ్ల లోపు వారే. ఈ మార్చి 31 న క్లోయీ ఝావో జరుపుకునే తన 39వ జన్మదినం తప్పనిసరిగా ప్రత్యేకమైనదై ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు ఈసారి ఆమెకు ఆస్కార్ ఆకాంక్షలు తెలిపేవారూ ఉంటారు. ఆమె దర్శకత్వం వహించిన అమెరికన్ డ్రామా ఫిల్మ్ ‘నోమాడ్‌ల్యాండ్’ కు ఆరు నామినేషన్లు దక్కడం ఆ ఆకాంక్షలకు ఒక కారణం అయితే, వాటిల్లో సగానికి సగం.. ‘బెస్ట్ డైరెక్టర్’, ‘బెస్ట్ ఆడాప్టెడ్ స్క్రీన్‌ప్లే’, ‘బెస్ట్ ఫిల్మిం ఎడిటింగ్’ కేటగిరీలలో క్లోయీ ఝావో నామినేషన్ పొందడం మరొక విశేషం. ఇప్పటివరకు ఆమె దర్శకత్వం వహించింది మూడంటే మూడే సినిమాలు అయినా.. వచ్చిన అవార్డులు, పొందిన నామినేషన్లు ముప్పైమూడు! తొలి సినిమా ‘సాంగ్స్ మై బ్రదర్స్ టాట్ మి’ (2015), రెండో సినిమా ‘ది రైడర్’ (2017), మూడోది ఇప్పుడీ ‘నోమాడ్‌ల్యాండ్’ (2020). ఝావో చైనా మహిళ. జడను ముందుకు వేసుకుంటే సుమారుగా మన ఇండియన్లా ఉంటారు. ఉండటం అమెరికాలో. బి.ఎ. చదివిందీ, ఎం.ఎఫ్.ఎ. చేసిందీ అమెరికాలోనే. సినిమాలు తియ్యాలన్న అభిలాష తల్లిదండ్రులనుంచేమీ ఆమెకు రాలేదు. తండ్రి బీజింగ్‌లోని ఒక స్టీల్ ప్లాంట్‌లో మేనేజర్. తల్లి హాస్పిటల్ లో వర్కర్. ఝావో కొంచెం దూకుడు. స్కూల్లో సోమరి. తనే ఆ మాట చెప్పుకుంటారు. క్లాస్ రూమ్‌లో జపాన్ వాళ్ల ‘మాంగా’ గ్రాఫిక్ నవలల్ని బుక్స్ మధ్యలో పెట్టుకుని లీనమైపోయి చదివారు. అవి బుర్రలో పని చేస్తున్నప్పుడు తనూ కొన్ని కాల్పనిక పాత్రల్ని సృష్టించారు. ఇలాంటి వాళ్లకు సినిమాలు నచ్చుతాయి. ఝావో తన టీనేజ్‌లో విపరీతంగా సినిమాలు చూశారు. కూతురు మాట వినడం లేదని, తనకు అస్సలు ఇంగ్లిష్ తెలియకపోయినా పేరెంట్స్ ఆమెను లండన్ తీసుకెళ్లి అక్కడో బోర్డింగ్ స్కూల్లో చేర్చి వచ్చారు. తల్లిదండ్రుల ఇష్టం లండన్. తన ఇష్టం లాస్ ఏంజెలిస్. హై స్కూల్ చదువు కోసం లాస్ ఏంజెలిస్ వెళ్లిపోయి, అక్కడే ఉండిపోయారు ఝావో. మొదటి సినిమా తీసేటప్పటికి ఆమె వయసు 33. ప్రస్తుతానికి ఆమె జీవిత భాగస్వామి సినిమాలే. సినిమాలు చూడటం, సినిమాలు తీయడం. సినిమాకు ఎన్ని ఫ్రేములైతే ఉంటాయో, రోజుకు అన్ని గంటలపాటు సినిమాలకు పని చెయ్యడం! క్లోయీ ఝావోకు నామినేషన్ దక్కడంతో ఆస్కార్ చరిత్రలో ‘బెస్ట్ ౖyð రెక్టర్’గా నామినేట్ అయిన తొలి ఆసియా మహిళగా గుర్తింపు పొందారు. ∙∙ ఎమరాల్డ్ ఫెనెల్.. ఝావో కన్నా నాలుగేళ్లు చిన్న. బొద్దుగా, ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్‌లా ఉంటారు. ఎప్పుడూ పుస్తకాలు చదువుతుంటారు. బ్రిటన్ మహిళ. నటి, రచయిత్రి, దర్శకురాలు. ఝావో ‘నోమాడ్‌ల్యాండ్’తోపాటు ఫెనెల్ దర్శకత్వం వహించిన ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ చిత్రం కూడా ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ యాక్ట్రెస్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే’, ‘బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్’ కేటగిరీలకు కూడా ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ నామినేట్ అయింది. ఝావోలా ఫెనెల్ కూడా మూడు నామినేషన్లు పొందారు. బెస్ట్ డైరెక్టర్‌తోపాటు.. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ పే’్ల కేటగిరీల్లో ఆమెకు చోటు లభించింది. ఫెనెల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రానికే నామినేషన్ దక్కడం ఒక విధంగా అవార్డు రావడమే. నోమాడ్‌ల్యాండ్, ప్రామిసింగ్ యంగ్ ఉమన్ ఫెనెల్ ప్రధానంగా నటి. 2010 నుంచీ ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. లండన్‌లో పుట్టారు. ఆక్స్‌ఫర్డ్‌లో బి.ఎ. చదివారు. తర్వాత సిట్కామ్ (సిట్యువేషనల్ కామెడీ) షోలలోకి వెళ్లారు. సినిమా కథలు, స్క్రిప్టులు రాశారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ రెండు చిత్రాలు.. నోమాడ్‌ల్యాండ్’, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ల కథాంశం కూడా మహిళలదే కావడం యాదృచ్చికమే. తన అరవైలలో ఉన్న మహిళ ‘గ్రేట్ రిసెషన్’ కాలంలో సర్వం కోల్పోయి వ్యాన్‌లో దేశ దిమ్మరిగా గడపడం నోమాడ్ ల్యాండ్ స్టోరీ అయితే.. జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వచ్చిన ఒక మహిళ కథ ప్రామిసింగ్ యంగ్ ఉమన్. ఈ రెండు చిత్రాలలో ఏ చిత్ర దర్శకురాలికి ఆస్కార్ వచ్చినా.. వారు ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో ఆస్కార్ పొందిన రెండో మహిళ అవుతారు. మొదటి మహిళ క్యాథ్రిన్ బెగెలో. 2010లో ‘హర్ట్ లాకర్’ అనే చిత్రానికి ఆమెకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. నామినేషన్‌కే 48 ఏళ్లు పట్టింది! తొంభై ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు (క్లోయీ, ఫెనెల్ లను మినహాయించి) ఐదుగురు మహిళలు మాత్రమే బెస్ట్ ౖyð రెక్టర్లుగా నామినేట్ అయ్యారు. 1976లో లీనా వెర్ట్మ్యూలర్ (సెవెన్ బ్యూటీస్), 1993లో జేన్ క్యాంపియన్ (ది పియానో), 2003లో సోఫియా కొప్పోలా (లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్), 2010లో క్యాథ్రీన్ బిగెలో (ది హర్ట్ లాకర్), 2017లో గ్రెటా గెర్విగ్ (లేడీ బర్డ్) నామినేట్ అవగా.. క్యాథ్రీన్ బిగెలోకు అవార్డు వచ్చింది. ఇక బెస్ట్ డైరెక్టర్‌గా ఒక మహిళ ఆస్కార్‌కు నామినేట్ అవడానికైతే 48 ఏళ్లు పట్టింది. ఆస్కార్ తొలి మహిళా ‘బెస్ట్ డైరెక్టర్’ క్యాథ్రీన్ బిగెలో. -
ఉపేంద్రకు అరుదైన గౌరవం
యశవంతపుర : నటుడు ఉపేంద్ర నటనలోనే కాకుండా ప్రపంచ స్థాయి 50 మంది ఉత్తమ దర్శకులలో ఉపేంద్ర కూడా ఒకరు. కన్నడంలో ఏ, ఓం లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం చేయడంతో పాటు మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నారు. బీఎండీబీ అనే సంస్థ ఉత్తమ దర్శకుల జాబితాను విడుదల చేసింది. అందులో 50 మంది పేర్లలో ఉపేంద్రకు 17వ స్థానం దక్కింది. దక్షిణ భారతదేశంలో ఏకైన దర్శకుడిగా ఉపేంద్ర పేరు తెచ్చింది. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే సినిమాలను తీసిన దర్శకుడు రాజ్‌కుమార్ ఇరాని రెండో స్థానంలో ఉన్నారు. సత్యజిత్ రేకి 49వ స్థానం దక్కింది. కన్నడంలో ఉపేంద్ర 9 సినిమాలకు దర్శకత్వం వహించారు. -
నోలన్.. ఆస్కార్ ఎప్పుడు దక్కెన్?
మార్చి 4న ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరీలో విన్నర్‌గా క్రిస్టొఫర్ నోలన్ అనే పేరు వినిపిస్తుందని కోట్లాదిమంది ఆయన అభిమానులు ఎదురుచూశారు. 21వ శతాబ్దపు సూపర్ సక్సెస్ఫుల్ దర్శకుల్లో టాప్ పొజిషన్లో ఒకరుగా ఉంటూ వస్తోన్న క్రిస్టోఫర్ నోలన్, తన ఇరవై ఏళ్ల కెరీర్లో మొదటిసారి ఆస్కార్‌కు బెస్ట్ డైరెక్టర్‌గా ఈ ఏడాదే నామినేట్ అయ్యాడు. ‘డంకర్క్’ పేరుతో తన పంథాకు భిన్నంగా, ఒక వార్ డ్రామాను తెరకెక్కించిన నోలన్, ఈ సినిమాతో అయినా ఆస్కార్ తప్పకుండా అందుకుంటాడన్న ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ రెండు విభాగాల్లో ఏదో ఒక విభాగానికి ఆయన అవార్డు అందుకుంటాడని భావించిన ఫ్యాన్స్‌కు ఈ ఏడాదీ నిరాశే ఎదురైంది. మరి నోలన్ అవార్డు ఎప్పుడు అందుకుంటాడు? ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల డాలర్లు కురిపిస్తోన్న సినిమాలను అందిస్తోన్న నోలన్, ఆస్కార్‌కు అర్హత సాధించేది ఎప్పుడు? నిజానికి నోలన్ గత చిత్రాలతో పోల్చి చూస్తే ‘డంకర్క్’ ఆయనను దర్శకుడిగా అన్నివిధాలా కొత్తగా పరిచయం చేసిన సినిమా. మేకింగ్‌లోనూ మ్యాజిక్ చూపించాడు. అయితే ఆస్కార్స్ మాత్రం గెలెర్మో డెల్టోరోకు మొగ్గు చూపింది. ‘డంకర్క్’ అన్నివిధాలా సరైన సినిమా అనుకున్నప్పుడే అవార్డు మిస్ అయింది. ఇక మళ్లీ నోలన్ సినిమా ఆస్కార్ వద్ద ఎప్పుడు నిలబడుతుందో.. నోలన్ అభిమానుల ఆస్కార్ కల ఎప్పుడు నెరవేరుతుందో!! ∙క్రిస్టొఫర్ నోలన్ -
ఎవరు కొట్టినా ఫస్టే!
ఆస్కార్ అవార్డుల ప్రదానానికి సరిగ్గా రెండు వారాల సమయం ఉంది. ఒక సోమవారం పోయి, ఇంకో సోమవారం వచ్చేస్తే, ఎవరెవరు ఆస్కార్ చేతిలో పట్టుకొని ఇంటికెళతారో తెలిసిపోతుంది. ఇప్పటికే ఎవరెవరు గెలుస్తారనేదానిపై ఎక్కడిలేని చర్చ జరుగుతోంది. అందులోనూ ‘బెస్ట్ డైరెక్టర్’ క్యాటగిరీకి వచ్చేసరికి ఆ చర్చ తారాస్థాయికి చేరుకుంది. ఈసారి బెస్ట్ డైరెక్టర్‌కు నామినేట్ అయిన వారిలో అందరూ డిఫరెంట్ జానర్ సినిమాలకు నామినేట్ అయినవారే! ఈ లిస్ట్‌లో ఉన్నవారంతా ఇప్పటివరకూ ఒక్క ఆస్కార్ కూడా పొందలేదు. కాబట్టి ఇందులో ఎవ్వరు ఆస్కార్ కొట్టినా అది ఫస్టే!! బెస్ట్ డైరెక్టర్‌కు నామినేట్ అయిన దర్శకుల గురించి ఈ వారం చూద్దాం.. క్రిస్టొఫర్ నోలన్ (సినిమా: డంకర్క్) ఇరవై ఏళ్లుగా హాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తోన్న డైరెక్టర్ క్రిస్టొఫర్ నోలన్. ఆయన సినిమాలకు పిచ్చిగా అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ బద్దలైపోతుంది. ఇప్పుడున్న వాళ్లలో టాప్ కమర్షియల్ డైరెక్టర్ ఎవరంటే అందరూ నోలన్ పేరే చెప్పేస్తారు. అలాంటి నోలన్‌కు బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరీలో ‘డంకర్క్’ వరకూ ఒక్క నామినేషన్ కూడా దక్కలేదు. తన శైలికి భిన్నంగా.. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో, డంకర్క్ ఎవాక్యుయేషన్‌ను కథగా ఎంచుకున్న నోలన్, టైమ్ అనే అంశాన్ని ‘డంకర్క్’ సినిమాలో బలంగా వాడుకుంటూ సక్సెస్ సాధించాడు. వార్ జానర్ సినిమాల్లో డంకర్క్ ఓ అద్భుతమైన ప్రయోగం. అలాంటి సినిమాకు నామినేట్ అవ్వడంతో సహజంగానే నోలన్ ఆస్కార్ కూడా అందుకోవడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. గతంలో స్క్రీన్‌ప్లేకు రెండు, నిర్మాతగా ఒక ఆస్కార్‌కు నామినేట్ అయిన నోలన్.. ఒక్క ఆస్కార్ కూడా అందుకోలేదు. ఈసారి ఆయనకే అవార్డు వస్తే, బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకుంటాడు నోలన్. అది ఆయన అభిమానులు ఎప్పట్నుంచో కంటోన్న ఓ గొప్ప కల! గెలెర్మో దెల్తోరో (సినిమా: ది షేప్ ఆఫ్ వాటర్) నోలన్ తర్వాత ఈ లిస్ట్‌లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకుంటాడన్న క్రేజ్ గెలెర్మో సొంతం చేసుకున్నాడు. ‘ది షేప్ ఆఫ్ వాటర్’తో ఇప్పటికే పలు అవార్డు వేడుకల్లో సత్తా చాటిన గెలెర్మో ఆస్కార్ రేసులో భారీ అంచనాల మధ్యనే అవార్డు అందుకుంటాడన్న పేరు తెచ్చుకున్నాడు. గెలెర్మోకి గతంలో ఒక నామినేషన్ దక్కింది. ఇప్పుడిది రెండోది. ఈసారి ఆస్కార్‌ను సొంతం చేసుకుంటే ఆయనకిది ఫస్ట్ ఆస్కార్. ‘ది షేప్ ఆఫ్ వాటర్’తో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడన్న పేరు తెచ్చుకున్నాడు గెలెర్మొ. జోర్డన్ పీలే ( సినిమా: గెటౌట్) కామెడీ నటుడు, రచయిత జోర్డన్ పీలే దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ‘గెటౌట్’. మొదటి సినిమాకే జోర్డన్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం విశేషం. ఆఫ్రికన్ – అమెరికన్ సంతతికి చెందిన వారిలో ఆస్కార్‌కు నామినేట్ అయిన ఐదోవాడు జోర్డన్. ఇతనే గనక బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ కూడా అందుకుంటే, ఈ ఐదుగురిలో ఆస్కార్ అందుకున్న మొదటివాడవుతాడు జోర్డన్. హారర్ కామెడీ జానర్లో జోర్డన్ ‘గెటౌట్’లో చేసిన ప్రయోగం అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. మేకింగ్ పరంగా తనకంటూ ఒక స్టైల్ సెట్ చేసుకున్నాడతను. నోలన్, గెల్మెరోలకు పోటీ ఇచ్చేలా జోర్డన్ కనిపించడం లేదని సినీ పండితుల అభిప్రాయం. కానీ ఆస్కార్‌కు నామినేట్ అయిన వారిలో ఎవరు గెలుస్తారన్నది చివరివరకూ చెప్పలేం కాబట్టి వేచి చూడాల్సిందే! పాల్ థామస్ ఆండర్సన్ (సినిమా: ఫాంటమ్ థ్రెడ్) ఆండర్సన్ ఈ లిస్ట్‌లో ఆస్కార్‌కు బాగా దగ్గరి వ్యక్తి. గతంలో ఆరుసార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన ఆండర్సన్, అవార్డు అయితే ఒక్కటీ అందుకోలేదు. ఇంగ్లాండ్ నేపథ్యంలో 1950ల కాలంలో నడిచే కథ పట్టుకొని, ‘ఫాంటమ్ థ్రెడ్’తో ఆండర్సన్ ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. మేకింగ్‌లో ఆయన స్థాయిని ఈ సినిమాలో అడుగడుగునా చూడొచ్చు. ‘ఫాంటమ్ థ్రెడ్’ కమర్షియల్‌గా మంచి సక్సెస్. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పటికే ఆరుసార్లు ఆస్కార్ మిస్ అయిన ఆండర్సన్ ఈసారైనా అవార్డు అందుకుంటాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఆండర్సన్పై పెద్దగా అంచనాలైతే లేవుకానీ, పోటీ అయితే బాగానే ఇచ్చేలా కనిపిస్తున్నాడు. డిఫరెంట్ జానర్లో తమ బ్రాండ్ చాటుకున్న ఈ దర్శకుల్లో ఆస్కార్ ఎవరు అందుకుంటారన్నది తెలియాలంటే మార్చి 4 వరకూ ఎదురు చూడాల్సిందే! మరి ఆరోజు బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరీలో ‘అన్డ్ ది అవార్డ్ గోస్ టూ..’ అనగానే ఎవరు లేచి నిలబడతారన్నది ఎదురు చూడాల్సిందే!! గెటా గర్‌విగ్ (సినిమా: లేడీ బర్డ్) ఏ సినీ పరిశ్రమలో అయినా డైరెక్టర్ అనేసరికి మేల్ డామినేషనే కనిపిస్తుంది. ఎక్కడో మెరుపుల్లా వుమన్ డైరెక్టర్స్ కనిపిస్తారు. గెటా గర్‌విగ్ చిన్న మెరుపు కాదు. మామూలు మెరుపు కూడా కాదు. ‘లేడీ బర్డ్’ సినిమాతో ఆమె హాలీవుడ్‌కు పరిచయమై, మొదటి సినిమాతోనే ఒక స్టార్ అనిపించుకుంది. 90 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో బెస్ట్ డైరెక్టర్‌గా ఇప్పటివరకూ నామినేట్ అయిన లేడీ డైరెక్టర్స్ ఐదుగురే! అందులో ఒక్కరికే (కేథరిన్ బైగ్లో – 2010) అవార్డు దక్కించుకుంది. ఇప్పుడు గెటా గనక అవార్డు దక్కించుకుంటే ఆమె రెండో వ్యక్తి అవుతుంది. ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ కథను చాలా సున్నితంగా, అద్భుతంగా సినిమాగా ఆవిష్కరించిన గెటా, ‘లేడీ బర్డ్’తో కమర్షియల్ సక్సెస్, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. -
టాలెంట్ ఉన్నోళ్లు కనిపించట్లేదు: జబర్దస్త్ ఆర్పీ
చిల్లకూరు: ‘జబర్దస్త్’తో నవ్వులు పూయిస్తూ వెండితెరపైనా సత్తాచాటుకుంటున్న వర్ధమాన నటుడు రాటకొండ ప్రసాద్ అలియాస్ ఆర్పీ. ఆయన సొంతూరు నెల్లూరు జిల్లా ఓజిలి మండలం సగటూరు. షూటింగ్ లేని సమయంలో తన వారిని కలుసుకునే ఆర్పీ.. చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూడు. అలా శుక్రవారం తన స్నేహితులతో కలిసి చిల్లకూరు వచ్చిన ఆర్పీని ‘సాక్షి’ పలుకరింగా మనస్సులోని మాటలను పంచుకున్నాడు.. ఎంత వరకు చదువుకున్నారు? డిగ్రీ వరకు చదువుకున్నా. ప్రాథమిక విద్య సగటూరు, చిలమానుచేను, ఇంటర్ నాయుడుపేట చదలవాడ జూనియర్‌కళాశాల, డిగ్రీ గూడూరులోని స్వర్ణాంధ్ర భారతిలో చదివా. జబర్దస్త్‌లోకి రాక ముందు ఏమి చేసేవారు? చదవు పూర్తి చేసిన తరువాత హైదరాబాద్ వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరా. సాధ్యం, గురుడు, గేమ్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గాపనిచేశా. జబర్దస్త్‌లో ప్రవేశం ఎప్పడు? 2014 నవంబరులో జబర్దస్త్‌లో ప్రవేశించా.ఇప్పటి వరకు 270 స్కిట్లు చేసా. సినిమాలపై దృష్టి సారించారా? గుర్తింపు తెచ్చే పాత్ర కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పటకే పది సినిమాల్లో నటించా. ప్రస్తుతం పెద్ద సినిమా చేస్తున్నా. పెద్ద డైరెక్టర్ కావాలన్నదే తన లక్ష్యం. కొత్త వారికి ప్రోత్సాహం ఎంతవరకు ఉంటుంది? కొత్త వారిని ప్రోత్సహించేందుకు ఎప్పుడూ సిద్ధమే. మంచి టాలెంట్ ఉన్న వారు కనిపించడంలేదు. ఇటీవల మహేష్ కనిపించాడు. అతనిలోని టాలెంట్‌ను గుర్తించి అవకాశాలు ఇస్తున్నాం. ఏమైనా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారా? గూడూరులో జూన్ మొదటి వారంలో ఒక కార్యక్రమాన్ని ప్రదర్శిస్తున్నా. తద్వారా వచ్చే నగదుతో పేదలకు సాయం అందించేందుకు చేయూత ఫౌండేషన్‌ను ప్రారంభిస్తున్నా. చివరగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? త్వరలోనే చేసుకుంటా. అమ్మాయి కోసం వెతుకుతున్నా కనబడగానే చేసుకుంటా(నవ్వూతూ) -
సీతావనలోకం లఘుచిత్రానికి అవార్డుల పంట
వరంగల్: వరంగల్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్ ఆదివారం రాత్రి ముగిసింది. మూడు రోజుల పాటు ప్రదర్శించిన చిత్రాల్లో సీతావనలోకం లఘు చిత్రానికి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ డైరెక్టర్ అవార్డును వేణు మాదాల అందుకున్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌తో పాటు రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ఈ వేడుకలకు హాజరయ్యారు. హీరోయిన్ అక్ష, గాయని కౌసల్య ఆటపాటలతో అలరించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్టివల్లో మొత్తం 118 లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఉత్తమ విదేశీ లఘు చిత్రంగా చైనా షార్ట్‌ఫిల్మ్ బస్44 ఎంపికైంది. -
ద్విభాషా చిత్రం... పరభాష స్ఫూర్తితో!
ఆ సీన్ - ఈ సీన్ దక్షిణాది దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక శైలిని కలిగిన దర్శకుల్లో ఒకరు వెంకట్ ప్రభు. స్పోర్ట్స్ కామెడీ అయిన తొలి సినిమా (చెన్నై 600028) తోనే డెరైక్టర్‌గా తన ప్రత్యేకత నిరూపించుకున్నాడు ఈ దర్శకుడు. అదే ‘సరోజ’ను రూపొందించాడు. యువన్ శంకర్‌రాజా కంపోజ్ చేసిన ఊపేసే సంగీతంతో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అంతటా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. అదే రివ్యూయర్లు ఈ సినిమాను ఒక హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రూపొందిం చారనే అంశాన్ని కూడా హైలెట్ చేశారు. అలాంటిదేమీ లేదని వెంకట్ ప్రభు చెప్పినా, తెలుగు తమిళ భాషల్లో వచ్చిన ఈ ద్విభాషా చిత్రం... ఒక పరభాషా చిత్రం ఆధారంగా రూపొందింది అన్నది వాస్తవం. 1993లో వచ్చిన హాలీ వుడ్ సినిమా ‘జడ్జిమెంట్ నైట్’ స్ఫూర్తితో ‘సరోజ’ రూపొందింది. ఈ రెండు సినిమాలకూ ఉన్న పోలికలే దీనికి సాక్ష్యం. ‘సరోజ’ సినిమాలో నలుగురు హీరోలు ఉంటారు... శివ, వైభవ్ రెడ్డి, ప్రేమ్‌జీ అమరన్, ఎస్పీ చరణ్. వీళ్లు నలుగురూ క్రికెట్ మ్యాచ్ చూడటానికి చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలు దేరతారు. జడ్జిమెంట్ నైట్ సినిమాలోనూ నలుగురు హీరోలు. ఒక బాక్సింగ్ బౌట్‌ను తిలకించడానికి తమ నగరం నుంచి పక్కనే ఉండే మరో నగరానికి ప్రయాణం అవుతారు. గమనించదగ్గ అంశం ఏమిటంటే, రెండు సినిమాల్లోనూ హీరోలు ఒక డిఫరెంట్ కార్వాన్లోనే ప్రయాణిస్తారు. ‘సరోజ’ సినిమాలో ఎస్పీ చరణ్, వైభవ్‌రెడ్డి అన్నదమ్ములుగా నటించారు. హాలీవుడ్ సినిమాలో కూడా నలుగురు స్నేహితుల్లో ఇద్దరు అన్న దమ్ములే! ఎస్పీ చరణ్ చేసిన పాత్రకు పెళ్లై, ఒక పాప ఉంటుంది. జడ్జిమెంట్ నైట్‌లో కూడా ఆ పాత్ర నేపథ్యం అలాగే ఉంటుంది. హైవే మీద ట్రాఫిక్ స్తంభించి పోవడంతో ఈ ప్రధాన పాత్ర ధారులు ప్రయా ణిస్తున వ్యాన్... దగ్గరి దారి అంటూ రోడ్డు నుంచి టర్న్ తీసుకోవడంతోనే కథ మలుపు తిరుగుతుంది. ఇలా మలుపు తిరిగిన ప్రయాణంలో వీళ్లకు తుపాకీ కాల్పులతో గాయపడ్డ ఒక వ్యక్తి తారస పడటం రెండు సినిమాల్లోనూ జరుగు తుంది. వీళ్లు ఒక హత్యకు సాక్షులు అవుతారు. ఆ హత్య చేసిన గ్యాంగ్ వీళ్లం దరినీ చంపేయడానికి ప్రయత్నిస్తుంది. ‘సరోజ’ సినిమాలోని ఈ ఎపిసోడ్స్ అన్నింటిలో ‘జడ్జిమెంట్ నైట్’ సినిమానే కనిపిస్తుంది. విశేషం ఏమిటంటే రెండు చిత్రాల్లోని ప్రధాన భాగమంతా రాత్రి పూటే జరుగు తుంది. కిడ్నాపింగ్ గ్యాంగ్ ఆవాసంగా మార్చుకున్న భవనంలో అనుకోకుండా చిక్కుబడతారు స్నేహితులు. ఆ భవనంలో ఉంటూ కూడా వీళ్లు ఆ గ్యాంగ్ కంటపడ కుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంతా హాలీవుడ్ సినిమాలో ఉంటుంది. దాన్నే దర్శకుడు యథా తథంగా తీసుకున్నట్టనిపిస్తుంది. ప్రాణాలు పోతాయేమో అనిపించేంత భయంకర పరిస్థితుల్లో నలుగురు స్నేహితుల మధ్య భావోద్వేగాలు, ఒకరిని రక్షించుకోవడానికి మరొకరు పడే పాట్లు... రెండు సినిమా ల్లోనూ ఒకేలా ఉంటాయి. ఈ భావోద్వే గాలను యథాతథంగా ఆవిష్కరించడంలో వె ంకట్ప్రభు విజయవంతం అయ్యాడు. అయితే మిగతా విషయాల్లో ‘జడ్జిమెంట్ నైట్’... ‘సరోజ’ కన్నా ఎన్నో మెట్లు పైన ఉంటుంది. ‘సరోజ’ సినిమాకు వెనుకా ముందు చాలా నేపథ్యాన్నే తయారు చేసు కున్నాడు దర్శకుడు. సొంతూరికి మేలు చేయ డానికి ధనికుడు అయిన తమ స్నేహితుడి కూతురినే (సరోజ) కిడ్నాప్ చేసే ఒక ముఠా, ఆ ముఠాకు సహయం చేసే పోలీసాఫీ సర్ (శ్రీహరి), అనుకో కుండా ముఠా చేతుల్లో పడి ముప్పు తిప్పలు పడి కిడ్నాప్ అయిన అమ్మా యిలను రక్షించే నలుగురు హీరోలు, వైభవ్ పాత్రకు కాజల్‌తో లవ్‌స్టోరీ... ఇలాంటి యాడింగ్స్ చేస్తూనే, అసలు కథ నేరేషన్‌కు మాత్రం ‘జడ్జిమెంట్ నైట్’ను ఆధారంగా చేసుకున్నాడు. అయితే వెంకట్‌ప్రభు మాత్రం ఈ విషయాన్ని అస్సలు ఒప్పుకోలేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా అడిగినా కాదని వాదించాడు. కానీ సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం ఇది కాపీనే అని స్పష్టమవుతుంది! - బి.జీవన్‌రెడ్డి -
ఆనందం అంబరమైతే...
ఈసారి ఆస్కార్ నీదే అన్నారు! - ఉత్తమ నటి జూలియన్ మూర్ (స్టిల్ఎలైస్) ‘‘నేను శ్రమను నమ్ముతాను. అలాగే, నిజమైన అనుబంధాలను, నిజాయతీ గల వ్యక్తులను, మంచి కుటుంబాలను నమ్ముతాను. ఇవన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. అందుకే చేశాను. వాస్తవానికి ఈ చిత్రం చేస్తున్నప్పుడు నా భర్తకు చెప్పలేదు. ఏకంగా సినిమా చూపిద్దామనుకున్నా. ఇద్దరం కలిసి ప్రివ్యూ చూశాం. సినిమా చూసి, బయటికొస్తున్నప్పుడు ‘ఈ ఏడాది ఆస్కార్ నీదే’ అన్నారు. ఈ తరహా చిత్రాలు విజయం సాధించడానికి కారణం.. ప్రేక్షకులు తమను తాము ఆ పాత్రల్లో ఊహించుకోవడంవల్లే’’ అంటూ ఓ విధమైన ఉద్వేగానికి గురవుతూ అన్నారు. ఇదో అద్భుతమైన కల.. ఇప్పట్లో మేలుకోలేను! - ఉత్తమ నటుడు ఎడ్డీ రెడ్మెయిన్ (ది థీరీ ఆఫ్ ఎవ్రీ థింగ్) ఈ కథ వినగానే శారీరకంగా, మానసికంగా నా పాత్రలో ఒదిగిపోవాలనుకున్నా. దాని ఫలితమే ఈ ఆస్కార్. వేదికపై నటి కేట్ బ్లాంచెట్ నోటి నుంచి నా పేరు వినగానే, అడుగులు తడబడ్డాయి. ఆ తడబాటుని కప్పి పుచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఈ బంగారు బొమ్మను అందుకోవడం అనేది ఓ అద్భుతమైన కలలా ఉంది. ఇప్పట్లో ఈ కల నుంచి మేలుకోలేను. మేలుకున్న తర్వాత ఇది కల కాదు.. నిజమే అని నమ్ముతాను. కొన్ని భయాలు విజయాలను ఆస్వాదించనివ్వవు - ఉత్తమ దర్శకుడు అలెగ్జాండ్రో జి. ఇనారిట్ (బర్డ్ మ్యాన్) అసలీ చిత్రాన్ని ఎందుకు తీశానో? ఎలా తీశానో? బంగారంలాంటి ఈ అవకాశం ఎందుకొచ్చిందో నేను చెప్పలేను. కొన్ని భయాలు.. విజయాలను ఆస్వాదించనివ్వవు. ప్రస్తుతం నేనా పరిస్థితిలో ఉన్నాను. కానీ, సినిమా చేసేటప్పుడు భయపడలేదు. అందుకే ఈ విజయం. అయినా ఆనందపడటంలేదు. నా జీవితంలో నేనెవరికైనా ధన్యవాదాలు చెప్పాలనుకుంటే అది మా అమ్మగారికే. నా జీవిత ప్రయాణం ఇందాకా రావడానికి కారణం ఆవిడే. స్త్రీని ప్రేమించే ప్రతి మగాడూ మా కోసం పోరాడాలి! - ఉత్తమ సహాయ నటి ప్యాట్రీషియా ఆర్క్వెట్టె (బాయ్‌హుడ్) నామినేషన్ పొందుతాననీ, అవార్డు కూడా సాధిస్తానని నేనూహించలేదు. ఈ సందర్భంగా నేను స్త్రీలకు సమాన హక్కుల గురించి మాట్లాడదల్చుకున్నాను. ఇతర దేశాల్లో పురుషులతో సమానంగా స్త్రీకి అన్ని హక్కులూ ఉండవని మాట్లాడుకుంటాం. కానీ, అమెరికాలో కూడా ఆ పరిస్థితే ఉంది. స్త్రీని ప్రేమించే ప్రతి మగవాడూ, స్త్రీలు, పన్ను కడుతున్న ప్రతి ఒక్కరూ... స్త్రీల సమాన హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. నటులకు ఇస్తున్నంత పారితోషికం నటీమణులకు కూడా ఇవ్వాలి. వయసు పైబడే కొద్దీ నటీమణుల పారితోషికం చాలా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. -
వేగాన్ని అందుకొన్నాడు.. విజేత అయ్యాడు!
వేగవంతంగా దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో... ఏ రంగంలోనైనా వేగాన్ని అందిపుచ్చుకొంటేనే పోటీలో ఉన్నట్టు. మొన్నటి వరకూ... ఒక యువకుడు సొంతంగా షార్ట్ఫిలిమ్ తీయడమే గొప్ప. అయితే ఇప్పుడు చాలా మంది ఆ పనిచేసేస్తున్నారు. మరి అదే షార్ట్‌ఫిలిమ్‌ను వేగవంతంగా తీస్తే... కౌంట్‌డౌన్ పెట్టుకొని కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తే... దాంతో అవార్డును అందుకొంటే... కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ ఛాన్స్‌కు దగ్గరైతే... అతడు వేగాన్ని అందిపుచ్చుకొన్న వ్యక్తి అవుతాడు. విజేత అవుతాడు. శ్రీరామ్ ఆదిత్య అలాంటి ఛాంపియనే! తన షార్ట్ఫిలిమ్ ‘ది కాన్స్పిరసీ’ ద్వారా ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ లో ‘బెస్ట్ డెరైక్టర్’ అవార్డును అందుకొన్న యువకుడితను. శ్రీరామ్, అతడి స్నేహితులు కలిసి రూపొందించిన ఆ సినిమా ఈ పోటీల్లో ‘బెస్ట్ ఫిలిమ్’గా కూడా నిలిచింది. ఈ నేపథ్యంలో శ్రీరామ్ గురించి, అతడి సినిమా గురించి... ‘ది కాన్స్పిరసీ’ శ్రీరామ్ ఆదిత్య స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఎనిమిదో షార్ట్ఫిలిమ్. హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు కాలేజ్‌లో బీటెక్ చదివే రోజుల నుంచి సినిమాలంటే అతనికి తగని ప్రీతి. ఎప్పటికైనా డెరైక్టర్ కావాలనేది అతని కల. మరి డెరైక్టర్ కావాలంటే ఫిలింనగర్ చుట్టూ చక్కర్లు కొట్టడానికి కన్నా మునుపు.. తనకు ఆ కల కనడానికి అర్హత ఉందని నిరూపించుకోవాలనుకొన్నాడతను. అందుకోసమే తన ఆలోచనలను తెరకెక్కించడం మొదలు పెట్టాడు. అలా తెరకెక్కినదే ‘చైల్డ్ లేబర్’ అనే షార్ట్ఫిలిమ్. చదువుకొనే సమయంలోనే శ్రీరామ్ రూపొందించిన ఆ సినిమా సౌతిండి యన్ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్‌గా నిలిచింది. దానికీ అవార్డు లభించింది. మరి శ్రీరామ్‌కు అంతకు మించిన ప్రోత్సాహం అవసరం లేకపోయింది. ఇంట్లో కూడా పూర్తి మద్దతు లభించడంతో, షార్ట్ఫిలిమ్లతో గుర్తింపు సంపాదించుకొనే ప్రక్రియను ముమ్మరం చేశాడు. ఈ క్రమంలోనే చదువు పూర్తి అయ్యింది.. గూగుల్‌లో ఉద్యోగం వచ్చింది, అటు నుంచి ఫేస్‌బుక్‌లోకి మారాడు. ఆ సంస్థల్లో పనిచేయడం ఎంతోమంది యువతకు కలల పంట. అయితే శ్రీరామ్ కల మాత్రం ‘సినిమా’. అందుకే ఉద్యోగాన్ని వదిలేసి.. సినిమా లక్ష్యంగా కార్యాచరణ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో షార్ట్ఫిలిమ్ పోటీలపై దృష్టి సారించాడు. దేశంలో నగరాల వారీగా జరిగే బుల్లి సినిమాల పోటీల్లో తన ప్రయత్నాలు చేయసాగాడు. ఎక్కడికి వెళ్లినా శ్రీరామ్ తన ప్రత్యేకతను అయితే నిరూపించుకొంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకూ శ్రీరామ్ ఎనిమిది షార్ట్‌ఫిలిమ్‌లు రూపొందించగా, నాలుగింటికి అవార్డులు వచ్చాయి! అవన్నీ కూడా 48 గంటల వ్యవధిలో రూపొందించిన సినిమాలే కావడం విశేషం! ప్రస్తుతం శ్రీరామ్ రూపొందించిన ‘ది కాన్స్పిరసీ’కి ఒక అంతర్జాతీయ స్థాయి సంస్థ అవార్డు రావడం, అది అమెరికాలో జరిగే ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శనకు అవకాశం దక్కించుకోవడంతో పాటు.. ఇండియన్ జ్యూరీలో కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో ప్రదర్శన కోసం కూడా పోటీలో ఉంది. మరి కాన్స్‌కు వీసా గనుక పొందితే శ్రీరామ్ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం ఉంది. షార్ట్‌ఫిలిమ్స్‌తో మంచి గుర్తింపు లభించిన నేపథ్యంలో ఫీచర్ ఫిలిం రంగంలోకి ప్రవేశించి... పూర్తిస్థాయిలో సినీ దర్శకుడు అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు శ్రీరామ్. తను సినిమా రంగానికి సరిపోయే వ్యక్తినేనని నిర్ధారణ చేసుకొని ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాడు. కథలను సిద్ధం చేసుకొని సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. సరైన సహకారం లభిస్తే మంచి సినిమాలను తీర్చదిద్దగలననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో శ్రీరామ్ విజయవంతం అవుతాడని ఆశిద్దాం. ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ అనే ఈ అంతర్జాతీయ స్థాయి సంస్థ నగరాల వారీగా షార్ట్ఫిలిమ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా హైదరాబాద్ యువత నుంచి ఎంట్రీలను కోరింది. ఈ అవకాశాన్ని శ్రీరామ్ సద్వినియోగం చేసుకొన్నాడు. కాంపిటీషన్ అంటే.. ముందస్తు ఏర్పాట్లతో వెళ్లడం కాదు. ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ వాళ్లు చెప్పిన కాన్సెప్ట్‌తో, వాళ్లు చెప్పిన ఒక పాత్రతో, కొన్ని పరిధుల మేరకు మెప్పించాలి! ఈ విషయంలోనే శ్రీరామ్ బృందం విజయవంతమైంది. ఒకే పాత్రతో..అది కూడా నిద్రపోతున్నట్టుగా చూపుతూ ఈ లఘుచిత్రాన్ని రూపొందించారు. బుక్, స్కేటింగ్ బోర్డ్, క్లాక్, గిటార్, స్మార్ట్‌ఫోన్ వంటి వస్తువులతో ఈ సినిమాను రూపొందించి మార్కులు కొట్టేసింది శ్రీరామ్, బృందం. దాదాపు 40 నుంచి 50 షార్ట్ ఫిలిమ్లు పోటీ పడగా వాటిల్లో ఇది అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఈ లఘు ప్రయత్నానికి సౌమిత్ లంక (సంగీతం, వాయిస్ ఓవర్), అవినాష్ మట్టా (ఎడిటింగ్), ప్రసాద్ కళ్ళేపల్లి (సినిమాటోగ్రఫీ), ఇంకా దుర్గ, గౌతమ్‌లు శ్రీరామ్‌కు అండగా నిలిచారు. ఇక, తెరపై కనిపించే ఒకే ఒక్క పాత్రలో అంకుర్ నటించాడు. అవార్డుల పంట మహీంద్రా కంపెనీ వాళ్లు తమ కారు ఒకదాన్ని మార్కెట్లో ప్రవేశపెడుతూ, ఆ కారును ఉపయోగించుకొంటూ లఘు చిత్రాలను రూపొందించాలనే పోటీని నిర్వహించింది. అందులో శ్రీరామ్ దర్శకత్వం వహించిన ‘ద డ్రైవ్’ దేశంలోనే ఉత్తమ 20 షార్ట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతకన్నా మునుపే ‘రన్ వీ రీల్’ కాంపిటీషన్ కోసం 48 గంటల్లో రూపొందించిన లఘుచిత్రానికి ప్రైజ్ వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు రూపొందించిన షార్ట్ ఫిలిమ్‌కు కూడా అవార్డు దక్కింది. ఇప్పుడు ద్వితీయ ప్రయత్నంలో ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ లభించింది.