
యశవంతపుర : నటుడు ఉపేంద్ర నటనలోనే కాకుండా ప్రపంచ స్థాయి 50 మంది ఉత్తమ దర్శకులలో ఉపేంద్ర కూడా ఒకరు. కన్నడంలో ఏ, ఓం లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం చేయడంతో పాటు మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నారు. బీఎండీబీ అనే సంస్థ ఉత్తమ దర్శకుల జాబితాను విడుదల చేసింది. అందులో 50 మంది పేర్లలో ఉపేంద్రకు 17వ స్థానం దక్కింది. దక్షిణ భారతదేశంలో ఏకైన దర్శకుడిగా ఉపేంద్ర పేరు తెచ్చింది. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే సినిమాలను తీసిన దర్శకుడు రాజ్‌కుమార్ ఇరాని రెండో స్థానంలో ఉన్నారు. సత్యజిత్ రేకి 49వ స్థానం దక్కింది. కన్నడంలో ఉపేంద్ర 9 సినిమాలకు దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment