క్రిస్టొఫర్ నోలన్
మార్చి 4న ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరీలో విన్నర్‌గా క్రిస్టొఫర్ నోలన్ అనే పేరు వినిపిస్తుందని కోట్లాదిమంది ఆయన అభిమానులు ఎదురుచూశారు. 21వ శతాబ్దపు సూపర్ సక్సెస్‌ఫుల్ దర్శకుల్లో టాప్ పొజిషన్‌లో ఒకరుగా ఉంటూ వస్తోన్న క్రిస్టోఫర్ నోలన్, తన ఇరవై ఏళ్ల కెరీర్లో మొదటిసారి ఆస్కార్‌కు బెస్ట్ డైరెక్టర్‌గా ఈ ఏడాదే నామినేట్ అయ్యాడు. ‘డంకర్క్’ పేరుతో తన పంథాకు భిన్నంగా, ఒక వార్ డ్రామాను తెరకెక్కించిన నోలన్, ఈ సినిమాతో అయినా ఆస్కార్ తప్పకుండా అందుకుంటాడన్న ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.
బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ రెండు విభాగాల్లో ఏదో ఒక విభాగానికి ఆయన అవార్డు అందుకుంటాడని భావించిన ఫ్యాన్స్‌కు ఈ ఏడాదీ నిరాశే ఎదురైంది. మరి నోలన్ అవార్డు ఎప్పుడు అందుకుంటాడు? ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల డాలర్లు కురిపిస్తోన్న సినిమాలను అందిస్తోన్న నోలన్, ఆస్కార్‌కు అర్హత సాధించేది ఎప్పుడు? నిజానికి నోలన్ గత చిత్రాలతో పోల్చి చూస్తే ‘డంకర్క్’ ఆయనను దర్శకుడిగా అన్నివిధాలా కొత్తగా పరిచయం చేసిన సినిమా. మేకింగ్‌లోనూ మ్యాజిక్ చూపించాడు. అయితే ఆస్కార్స్ మాత్రం గెలెర్మో డెల్‌టోరోకు మొగ్గు చూపింది. ‘డంకర్క్’ అన్నివిధాలా సరైన సినిమా అనుకున్నప్పుడే అవార్డు మిస్ అయింది. ఇక మళ్లీ నోలన్ సినిమా ఆస్కార్ వద్ద ఎప్పుడు నిలబడుతుందో.. నోలన్ అభిమానుల ఆస్కార్ కల ఎప్పుడు నెరవేరుతుందో!!
∙క్రిస్టొఫర్ నోలన్
Comments
Please login to add a commentAdd a comment