
'ఇళయరాజా కులాసాగా ఉన్నారు'
చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని దర్శకుడు, నటుడు వెంకట్ ప్రభు తెలిపారు. ఆస్పత్రి నుంచి నేడు డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.
'ఇళయరాజా ఆస్పత్రిలో చేరారని తెలియగానే అభిమానులు, సన్నిహితులు కంగారు పడ్డారు. ఇళయరాజా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఆయనిప్పుడు కులాసాగా ఉన్నారు. జనరల్ చెకప్ కోసమే ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచి ఈరోజే విడుదలవుతారు' అని వెంకట్ ప్రభు సోమవారం ట్వీట్ చేశారు.
కడుపు నొప్పితో బాధపడుతూ ఆయన ఈనెల 15న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగానే ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు ఇళయరాజా కుటుంబ సభ్యులు తెలిపారు. 72 ఏళ్ల ఇళయరాజా 5 వేలకు పైగా పాటలు కంపోజ్ చేశారు.
For all isaignani fans and well wishers out there!! Raja pa is absolutely fine!! Just a general check up & few tests! He is back home 2day