
ఏడు సెట్లలో హీరో నాగచైతన్య, హీరోయిన్ కృతీ శెట్టి ఆడిపాడుతున్నారు. ఎందుకంటే ‘కస్టడీ’ చిత్రం కోసం. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కస్టడీ’. పవన్ కుమార్ సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో నాగచైతన్య, కృతీపై ఒక పాట చిత్రీకరిస్తున్నారు.
ఈ పాట కోసం ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్ డీవై సత్యనారాయణ ఏడు సెట్స్‌ని రూపొం దించారు. ‘‘ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న చిత్రం ‘కస్టడీ’. ఇందులోని ఓ పాటని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో హీరో హీరోయిన్లపై చిత్రీకరిస్తున్నాం. ఈ పాట కోసమే ఏడు సెట్లు వేయించాం. ఈ పాట కనువిందుగా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా మే 12న ‘కస్టడీ’ రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment