
నాగచైతన్య ‘కస్టడీ’ పూర్తయింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ‘కస్టడీ’. కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అరవింద స్వామి విలన్ రోల్ చేస్తుండగా, ప్రియమణి, సంపత్ రాజ్, శరత్‌కుమార్ కీ రోల్స్ చేశారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
ఈ సందర్భంగా యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘చైతూ... మా ‘కస్టడీ’ నుంచి ఇక నీకు విడుదల’’ అని వెంకట్ ప్రభు పేర్కొన్నారు. ‘‘మే 12న మీ అందరినీ (ప్రేక్షకులు) కస్టడీలోకి తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు నాగచైతన్య, కృతీశెట్టి. ‘‘నాగచైతన్య కెరీర్‌లోని అత్యంత భారీ బడ్జెట్ మూవీస్‌లో ‘కస్టడీ’ ఒకటి. ఇళయ రాజా, యువన్‌శంకర్ రాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.