జై రాకున్నా పర్వాలేదు
నాకు జై అవసరం లేదు ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు అని అన్నారు ప్రముఖ దర్శకుడు వెంకట్‌ప్రభు. చెన్నై-28 తో దర్శకుడిగా పయనం ఆరంరాకునభించిన ఈయన కేరీర్ దశాబ్దానికి చేరుకుంది. తొలి చిత్రంతోనే అందరూ కొత్తవారితో సంచలన విజయాన్ని సాధించిన వెంకట్‌ప్రభు తాజాగా తన తొలి చిత్రం చెన్నై-28కు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగంలో నటించిన వారందరూ ఈ చిత్రంలో నటించడం ఒక విశేషం అయితే అదనంగా వైభవ్, నిర్మాత టి.శివ, ఐశ్వర్య, సుబ్బు పంజు మరి కొందరు నటించారు.
యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని రెండు పాటలను డూపాడూ డాట్‌కామ్ ద్వారా బుధవారం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన విలేక ర్ల సమావేశంలో ఒక జై మినహా చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌కు యూనిట్ సభ్యులందరూ విధిగా పాల్గొనాలని నిర్మాత టి.శివ అన్నారు. నటుడు అజిత్ తనకంటూ ఒక పాలసీని పెట్టుకున్నారని, ఆయన స్థాయికి వచ్చిన తరువాత ఇతర నటులు కూడా అలాంటి పాలసీని పెట్టుకోవచ్చునని అన్నారు.
నటుడు జైని ఉద్దేశించా మీ వ్యాఖ్యలు అన్న విలేకరుల ప్రశ్నకు అవునని ఆయన బదులిచ్చారు. చిత్ర దర్శకుడు వెంకట్‌ప్రభు కల్పించుకుని తనకు జయ్ రాకపోయినా పర్వాలేదు ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని బ్లాక్ టికెట్ పతాకంపై వెంకట్‌ప్రభునే నిర్మించడం విశేషం. చెన్నై-28 చిత్రం 20-20 మ్యాచ్ అంత స్పీడ్‌గా ఉంటే దానికి సీక్వెల్ అయిన ఈ చిత్రం అంతకంటే వేగంగా 15-15 మ్యాచ్ మాదిరి ఉంటుందని అన్నారు. ఈ చిత్ర ఆడియోనూ డూపాడూ సంస్థ విడుదల చేస్తోందని తెలిపారు.
ఈ సంస్థ ఒక కొత్త ఫార్ములాను ప్రవేశపెడుతోందని, పాటలను విన్న శ్రోతలకు, సంగీతదర్శకుడికి,నిర్మాతకు డబ్బులు వస్తాయని చెబుతోందని అన్నారు. చిత్ర షూటింగ్‌ను 22 రోజుల్లో 44 కాల్‌షీట్స్‌లో శరవేగంగా పూర్తి చేసినట్లు అందుకు యూనిట్ వర్గాల సహకారమే కారణం అని చెప్పారు. నవంబర్ 10న చెన్నై 28ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాత వెంకట్‌ప్రభు వెల్లడించారు.