Chennai 28 Sequel
-
జై రాకున్నా పర్వాలేదు
నాకు జై అవసరం లేదు ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు అని అన్నారు ప్రముఖ దర్శకుడు వెంకట్‌ప్రభు. చెన్నై-28 తో దర్శకుడిగా పయనం ఆరంరాకునభించిన ఈయన కేరీర్ దశాబ్దానికి చేరుకుంది. తొలి చిత్రంతోనే అందరూ కొత్తవారితో సంచలన విజయాన్ని సాధించిన వెంకట్‌ప్రభు తాజాగా తన తొలి చిత్రం చెన్నై-28కు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగంలో నటించిన వారందరూ ఈ చిత్రంలో నటించడం ఒక విశేషం అయితే అదనంగా వైభవ్, నిర్మాత టి.శివ, ఐశ్వర్య, సుబ్బు పంజు మరి కొందరు నటించారు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని రెండు పాటలను డూపాడూ డాట్‌కామ్ ద్వారా బుధవారం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన విలేక ర్ల సమావేశంలో ఒక జై మినహా చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌కు యూనిట్ సభ్యులందరూ విధిగా పాల్గొనాలని నిర్మాత టి.శివ అన్నారు. నటుడు అజిత్ తనకంటూ ఒక పాలసీని పెట్టుకున్నారని, ఆయన స్థాయికి వచ్చిన తరువాత ఇతర నటులు కూడా అలాంటి పాలసీని పెట్టుకోవచ్చునని అన్నారు. నటుడు జైని ఉద్దేశించా మీ వ్యాఖ్యలు అన్న విలేకరుల ప్రశ్నకు అవునని ఆయన బదులిచ్చారు. చిత్ర దర్శకుడు వెంకట్‌ప్రభు కల్పించుకుని తనకు జయ్ రాకపోయినా పర్వాలేదు ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని బ్లాక్ టికెట్ పతాకంపై వెంకట్‌ప్రభునే నిర్మించడం విశేషం. చెన్నై-28 చిత్రం 20-20 మ్యాచ్ అంత స్పీడ్‌గా ఉంటే దానికి సీక్వెల్ అయిన ఈ చిత్రం అంతకంటే వేగంగా 15-15 మ్యాచ్ మాదిరి ఉంటుందని అన్నారు. ఈ చిత్ర ఆడియోనూ డూపాడూ సంస్థ విడుదల చేస్తోందని తెలిపారు. ఈ సంస్థ ఒక కొత్త ఫార్ములాను ప్రవేశపెడుతోందని, పాటలను విన్న శ్రోతలకు, సంగీతదర్శకుడికి,నిర్మాతకు డబ్బులు వస్తాయని చెబుతోందని అన్నారు. చిత్ర షూటింగ్‌ను 22 రోజుల్లో 44 కాల్షీట్స్లో శరవేగంగా పూర్తి చేసినట్లు అందుకు యూనిట్ వర్గాల సహకారమే కారణం అని చెప్పారు. నవంబర్ 10న చెన్నై 28ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాత వెంకట్‌ప్రభు వెల్లడించారు. -
మళ్లీ నటించాలనే..
చెన్నై 28 చిన్న చిత్రాల్లో 2004లో ట్రెండ్ సెట్టర్ చిత్రం ఇది. అనూహ్య విజయంతో పాటు చాలా మంది నూతన కళాకారులకు సినీ జీవితాన్నిచ్చిన చిత్రం. స్ట్రీట్ క్రికెట్‌ను తెరపై అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన చిత్రం చెన్నై 28. ఆ చిత్రంతో వెండితెరపై ఆవిష్కృతమైన తారల్లో నటి విజయలక్ష్మి ఒకరు. పక్కింటి పరువాల అమ్మాయిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ అచ్చ తమిళ బ్యూటీ ఆ తరువాత చాలా చిత్రాల్లో నాయకిగా నటించారు. అంతే కాదు ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే స్థాయికి చేరుకున్నారు. ఆయనకు జంటగా సుత్తాన్ ది వారియర్ యానిమేషన్ చిత్రంలో నటించారు. దురదృష్టవశాత్తు ఆ చిత్రం పూర్తి కాలేదు గానీ లేకుంటే విజయలక్ష్మి మరో స్థాయికి చేరి ఉండేవారు. నటిగా తక్కువ కాలంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ నటనకు కొంత కాలం దూరం అయ్యారు. ఆ తరువాత దర్శకుడు వెంకట్‌ప్రభు చెన్నై 28కు సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో తొలి భాగంలో నటించిన తారలే నటిస్తారని ప్రకటించారు. అయితే పెళ్లి చేసుకుని నటనకు దూరంగా ఉన్న విజయలక్ష్మి చెన్నై 28 రెండో భాగంలో నటిస్తారా? అన్న సందేహం వ్యక్తమైంది.అయితే దర్శకుడు వెంకట్‌ప్రభు ఆమెనే నటింపజేయడంలో సఫలీకృతుడయ్యారు.చిన్న గ్యాప్ తరువాత మళ్లీ ముఖానికి రంగేసుకున్నా నటి విజయలక్ష్మిని చెన్నై 28 సీక్వెల్లో నటించడానికి కారణమేమిటన్న ప్రశ్నకు నటిగా మరుప్రవేశం చేయాలన్న నిర్ణయమేనని బదులిచ్చారు. అయితే చాలా కాలంగా బుల్లితెరలో చేస్తున్న యాంకరింగ్‌ను మానుకోనని అన్నారు.చెన్నై 28కు సీక్వెల్లో నటించడం ఆనందంగా ఉందన్నారు. పాత మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్రంలో ఎక్కువ, తక్కువ కాకండా మాట్లాడతానేమో గానీ షూటింగ్ సెట్లో కో ఆర్టిస్టులతో జోకుల వేస్తూ చాలా సరదాగా గడిపేస్తానన్నారు. ఒక షూటింగ్‌లా కాకుండా కుటుంబ సభ్యులతో పిక్నిక్కు వెళ్లినట్లు చాలా జాలీగా చెన్నై 28 సీక్వెల్ షూటింగ్ సెట్లో గడిపామన్నారు. విజయలక్ష్మి ఇటీవల నిర్మాతగా మారి తన భర్త ఫరోజ్ దర్శకత్వంలో పండిగై అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణం అన్నది బాధ్యతతో కూడినది అయినా తాను అందులోనూ ఎంజాయ్ చేస్తూ చేస్తున్నానని అన్నారు.