
యంగ్ హీరో నాగచైతన్య కెరీర్ పరంగా జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. వెంకీమామ, లవ్‌స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్‌లను సొంతం చేసుకున్న చైతూ.. ‘థ్యాంక్యూ’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ అమీర్ ఖాన్‌తో `లాల్ సింగ్ చద్దా` చిత్రంలో నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బీజీగా ఉంటూనే..మరోవైపు ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం దూత పేరుతో వెబ్ సిరీస్ చేస్తున్నాడు.
ఇలా వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న చైతూ.. తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించి అక్కినేని ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచాడు. తొలిసారి ఆయన ద్విభాషా చిత్రం(తెలుగు, తమిళం)చేసేందుకు రెడీ అయ్యారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతూ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పై పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇది నాగచైతన్య నటిస్తున్న 22వ చిత్రం కావడం విశేషం. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలోఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Thank q so much saar ❤️ https://t.co/d07LhbmmgJ
— venkat prabhu (@vp_offl) April 6, 2022