NC 22: Naga Chaitanya Action Schedule Begins In Hyderabad - Sakshi
Sakshi News home page

అరవింద్‌ స్వామితో ఫైట్‌కు సిద్ధమైన నాగచైతన్య

Published Sat, Nov 12 2022 12:43 AM | Last Updated on Sat, Nov 12 2022 10:33 AM

Naga Chaitanya action schedule begins in Hyderabad  - Sakshi

నాగచైతన్య హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కృతీశెట్టి హీరోయిన్‌. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ఆరంభం అయింది.

ఓ భారీ సెట్‌లో నాగచైతన్య, అరవింద్‌ స్వామిలపై యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఫైట్‌ మాస్టర్‌ మహేశ్‌ మాథ్యూ డిజైన్‌ చేసిన ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌లో కృతీశెట్టి, శరత్‌కుమార్, సంపత్‌ రాజ్‌ కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాకు తండ్రీకొడుకు ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా స్వరకర్తలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement