కోలీవుడ్‌లో మసాలా పాప్కార్న్, వైట్ ఫెదర్స్ స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మిస్తున్న చిత్రం 'నన్బన్ ఒరువన్ వంద పిరగు'. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు చిత్ర నిర్మాణ సంస్థలో పని చేసిన ఐశ్వర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనందన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనిగురించి ఐశ్వర్య తెలుపుతూ దర్శకుడు వెంకట్ ప్రభు చిత్ర నిర్మాణ సంస్థలో పని చేసిన అనుభవంతో మంచి జనరంజకమైన చిత్రాలు నిర్మించాలని తలచానన్నారు.
(ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!)
మసాలా పాప్కార్న్ చిత్ర నిర్మాణ సంస్థలో రూపొందే చిత్రాలు ప్రేక్షకులకు సంతృప్తి కలిగించే విధంగా ఉండాలి. మంచి వినోదాన్ని అందించేలా ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. అలా మంచి స్నేహమయ జీవితంతో కూడిన చిత్రంగా నన్బన్ ఒరువన్ వంద పిరగు అని చెప్పారు. వైట్ ఫెదర్స్ స్టూడియోస్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు.
తమ మధ్య స్నేహమే ఈ చిత్రం ఇంత దూరం రావడానికి కారణమన్నారు. కాగా దర్శకుడు వెంకట్ ప్రభు దీనికి సమర్పకుడు వ్యవహరిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాలో పాటు అధిక భాగం సింగపూర్‌లో నిర్వహించినట్లు చెప్పారు. చైన్నె 28 చిత్ర జ్ఞాపకాలను గుర్తు చేసే ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం సంతోషంగా ఉందని దర్శకుడు వెంకట్ ప్రభు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment