
నాగచైతన్య హీరోగా తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చై కెరీర్‌లో ఇది 22వ సినిమా. నేడు(నవంబర్23) నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ మూవీకి ‘కస్టడీ’ అని టైటిల్ ఖరారు చేశారు. ఇందులో నాగచైతన్య పోలీసు పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది.
అయితే తోలి అధికారులే ఆయన్ను కదలకుండా ఎందుకు బంధించారనేది సస్పెన్స్‌గా పెట్టారు మేకర్స్. 'ప్రపంచంలో మార్పు రావాలంటే... ముందుగా నువ్వు మారాలి' అనే కొటేషన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రియమణి, శరత్ కుమార్, అరవిందస్వామి, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, సంపత్ రామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment