సినిమా నటీనటులకు ట్రోలింగ్ అనేది మాములే. ఏదో ఒక విషయంలో వారిని ట్రోల్ చేస్తునే ఉంటారు. ఇక గాసిప్స్ గురించి చెప్పనక్కర్లేదు. పర్సనల్ విషయాల్లోనూ చాలా పుకార్లు సృష్టిస్తుంటారు. కానీ కొంతమంది హీరోహీరోయిన్లు వీటిని పెద్దగా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ని భరించలేకపోతారు. భయపడతారు..బాధ పడతారు..డిప్రెషన్‌లోకి వెళ్తారు. హీరోయిన్ మీనాక్షి ఈ కేటగిరిలోకే వస్తుంది. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ కారణంగా తాను మనస్థాపానికి గురయిందట. వారం రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లారట. ఈ విషయాన్ని స్వయంగా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary )నే చెప్పింది.
‘ది గోట్’పై ట్రోలింగ్!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(vijay), వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ది గోట్’(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ) గతేడాది సెప్టెంబర్ 5న విడుదైన సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ డ్రామా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, శివకార్తికేయన్, త్రిష అదితి పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఫస్ట్ డే ఓపెనింగ్ అదిరిపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం డ్రాప్ అయ్యింది. ఈ చిత్రం విషయంలో మీనాక్షిపై ట్రోలింగ్ జరిగింది.
ఇందులో కొడుకుగా నటించిన విజయ్ పాత్రను ఏఐ టెక్నాలజీలో రూపొందించారు. ఈ పాత్రకు జంటగా నటి మీనాక్షి చౌదరి నటించారు. రిలీజ్ తర్వాత మీనాక్షి పాత్రపై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తూ వీడియోలను షేర్ చేశారు. అవి చూసి మీనాక్షి చాలా బాధపడిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ.. ‘‘విజయ్ హీరోగా వచ్చిన ‘ది గోట్’ విడుదలైన తర్వాత నన్ను చాలా మంది ట్రోల్ చేశారు. అవి చూసి ఎంతో బాధపడ్డా. వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లా. తర్వాత ‘లక్కీ భాస్కర్’ విడుదలైంది. ఆ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంది. అందులో నా నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి. కథల ఎంపికలో మార్పులు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. మంచి సినిమాలపై దృష్టిపెట్టాలని అర్థం చేసుకున్నా’ అని చెప్పారు.
‘సంక్రాంతి..’తో బిజీ బిజీ
ప్రస్తుతం మీనాక్షి చౌదరి నటించిన‘సంక్రాంతికి వస్తున్నాం’(sankranthiki vastunam Movie) సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఐశర్వర్య రాజేశ్ మరో హీరోయిన్. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మీనాక్షి ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో చేస్తున్నారు మీనాక్షి. దానికి గల కారణం కూడా చెప్పారు. ‘గతేడాది ఆరు సినిమాలు చేశాను. నెలకో సినిమా రిలీజ్ అయింది. షూటింగ్ కారణంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే సమయం దొరకలేదు. ఈ సారి మాత్రం కాస్త గ్యాప్ దొరికింది. అందుకే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాను’ అని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment