
స్టార్ హీరో సినిమా రిలీజవుతుందంటే అభిమానులు థియేటర్లకు క్యూ కడతారు. అలాంటిది దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు చేసిన చివరి చిత్రం 'గోట్' నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో అటు సోషల్ మీడియాలో ఇటు థియేటర్ల వద్ద సందడి నెలకొంది. హీరోయిన్ త్రిష సైతం ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేసింది. నిర్మాత అర్చన కలపతితో కలిసి చెన్నైలోని ఓ థియేటర్‌లో గోట్ వీక్షించింది.
గెస్ట్ రోల్
ఇకపోతే గోట్ సినిమాలో త్రిష అతిథి పాత్రలో మెరిసింది. ఓ పాటలో విజయ్‌తో కలిసి స్టెప్పులేసింది. కాగా వీరి జంటకు పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. 2004లో గిల్లి మూవీలో విజయ్- త్రిష జంటగా నటించారు. ఈ జోడీ అభిమానులకు తెగ నచ్చేసింది. తిరుపాచి, ఆతి, కురువి చిత్రాల్లోనూ ఈ కాంబినేషన్ రిపీట్ అయింది. ఇటీవల వచ్చిన లియో మూవీలోనూ విజయ్‌తో కలిసి యాక్ట్ చేసింది. ఇప్పుడు గోట్‌లో ఓ పాటలో మెరిసింది.
Engada Andha Yellow Saree
BTS of #Trisha From #Matta Song#TheGreatestAllTime #TheGOAT pic.twitter.com/iUUxJ52xAq— RINKU (@RinkuRv03012001) September 5, 2024