నటి దేవయాని చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనుంది. టాలీవుడ్‌లో సుస్వాగతం సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నటించిన ఆమె ఆ తర్వాత శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, నాని వంటి చిత్రాల్లో కనిపించింది. అయితే 2001లో పెళ్లి అయిన తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2018లో అరవింద సమేత వీర రాఘవ, లవ్ స్టోరీ మూవీలో కనిపించింది.
చాలా కాలం తర్వాత దేవయాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తెరపైకి రాబోతుంది. . దర్శన్ ఫిలిమ్స్ పతాకంపై జ్యోతిశివ నిర్మిస్తున్న 'నిళర్కుడై' అనే తమిళ ప్రాజెక్ట్‌లో ఆమె నటించనుంది. ఈ చిత్రం ద్వారా శివ ఆర్ముగం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు కేఎస్.అదియమాన్ శిష్యుడు అన్నది గమనార్హం. తెలుగులో బొబ్బిలి వంశం (బాలకృష్ణ) సినిమాను అదియమాన్ డైరెక్ట్ చేశాడు.
విజిత్ కథానాయకుడుగా నటిస్తున్న ఇందులో కన్మణి మనోహరన్ కథానాయకిగా నటిస్తున్నారు. ఇళవరుసు, రాజ్‌కపూర్, మనోజ్‌కుమార్, వడివుక్కరసి, కవిత రవి, అక్షర ముఖ్యపాత్రలు పోషిస్తుండగా దర్శన్ మరో వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు. అదేవిధంగా నిహారిక, అహనా అనే ఇద్దరు బాల తారలు నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈతరం యువత విదేశీ మోహం తమ కుటుంబ అనుబంధాలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు ఎలా ప్రతిబంధకంగా మారుతోంది, తద్వారా ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి వంటి పలు ఆసక్తికరమైన అంశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment