జూన్‌లో తమిళుక్కు ఒండ్రై అలుత్తవుం | Tamillukku ondrai aluthavum in June | Sakshi
Sakshi News home page

జూన్‌లో తమిళుక్కు ఒండ్రై అలుత్తవుం

Published Wed, May 21 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

జూన్‌లో తమిళుక్కు ఒండ్రై అలుత్తవుం

జూన్‌లో తమిళుక్కు ఒండ్రై అలుత్తవుం

తమిళుక్కు ఒండ్రై అలుత్తవుం చిత్రం జూన్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది. యువ నటుడు నకుల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోగా అట్టకత్తి దినేష్ నటిస్తున్నారు. హీరోయిన్లుగా బిందుమాధవి, నవ నటి ఐశ్వర్య నటిస్తున్నారు. వి.ఎల్.ఎస్.రాక్ సినిమా పతాకంపై వి.చంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు రామ్‌ప్రకాష్ పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు శరవణన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. పలు యాడ్ ఫిలిం చేసినా రామ్ ప్రకాష్ తన తొలి చిత్రం తమిళుక్కు ఒండ్రై అలుత్తవుం చిత్రం గురించి తెలుపుతూ ఒక సంఘటనతో వేదనకు గురై కథలోని పాత్రలు చివరికి ఆ వేదన నుంచి ఎలా బయటపడతాయనేది ఈ చిత్రం అని తెలిపారు.

చిత్రంలోని ప్రధాన పాత్రలను ఆ సంఘటన కలుపుతుందన్నారు. చిత్రంలో లవ్, యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ అంటూ అన్ని కమర్షియల్ అంశాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. అయితే ఇతర కమర్షియల్ చిత్రాలకు పూర్తి డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పగలనన్నారు. ఇది  ట్రెండ్  సెట్ చేస్తుందన్నారు. చిత్రంలో నకుల్ పోరాట దృశ్యాలు అచ్చెరువు పరుస్తాయన్నారు. అట్టకత్తి దినేష్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈయనకు జంటగా బిందు మాధవి, నకుల్ సరసన ఐశ్వర్య నటిస్తున్నారని ఈ చెన్నై బేస్డ్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని ఒక్క పాటను దినేష్, బిందుమాధవిలపై చిత్రీకరించాల్సి ఉందని దర్శకుడు వెల్లడించారు. చిత్రాన్ని జూన్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement