అలరిస్తూ ఆలోచింపజేసే చిత్రం | Brahma dot com movie updates | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 13 2017 10:16 AM | Last Updated on Wed, Dec 13 2017 10:16 AM

Brahma dot com movie updates - Sakshi

తమిళ సినిమా: సగటు ప్రేక్షకుడికి కావలసినంత వినోదాన్ని పంచి అదే సమయంలో ఆలోసింపజేసే చిత్రంగా బ్రహ్మ.కామ్‌ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు పురుష్‌ విజయ్‌ తెలిపారు. మెలినా కార్తికేయన్‌ నిర్మించిన ఈ చిత్రం లో నకుల్‌ హీరోగా నటించారు. ఆయనకు జంటగా ఆస్నాజవేరి నటించగా సిద్ధార్థ్‌ విపిన్, దర్శకుడు కే.భాగ్యరాజ్, నటి నీతూచంద్ర,కౌశల్య, ముట్టై రాజేంద్రన్‌  ముఖ్య పాత్రలను పోషించారు. ఇటీవలే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకున్న ఈ చిత్రం ఈ నెల 15వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. 

ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ భగవంతుడిని అందరూ ఏదోఒకటి కోరుతూనే ఉంటారన్నారు. అయితే ఆయన సృష్టించిన మనకి ఏమేం చేయాలో ఆయనకు తెలియదా?అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రం బ్రహ్మ.కామ్‌  అని తెలిపారు. ఇది పూర్తి స్థాయి వినోదంతో కూడిన చిత్రమే అయినా ఆలోచింపజేసే సన్నివేశాలు చాలానే ఉంటాయన్నారు. హీరో నకుల్‌ ఒక యాడ్‌ ఫిలిం డర్శకుడున్నారు. నటి ఆస్నాజవేరి మోడల్‌ అని, సిద్ధార్థ్‌ విపిన్‌ యాడ్‌ కంపెనీ నిర్వాహకుడిగా నటించారని తెలిపారు. నకుల్, సిద్ధార్థ్‌ విపిన్‌లిద్దరూ ఆస్నాజవేరిని ప్రేమిస్తుంటారని చెప్పారు.

దర్శకుడు కే.భాగ్యరాజ్‌ దేవుడిగా నటించారన్నారు.దేవుడంటే కిరీటం ధరించి కాకుండా సాధారణ మనిషిలానే కనిపిస్తారని, ఆయన్ని నకుల్‌ ఎప్పుడూ ఎదో ఒకటి అడుగుతూ చేసే గోల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఇక నటి నీతూచంద్ర చిత్రంలోనూ నటిగానే నటించి ఒక గ్లామరస్‌ పాత్రలోనూ కనువిందు చేయనున్నారని దర్శకుడు తెలిపారు. చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement