రెస్టాఫ్ ఇండియా 264 ఆలౌట్ | rest of india 264 allout | Sakshi
Sakshi News home page

రెస్టాఫ్ ఇండియా 264 ఆలౌట్

Published Thu, Mar 19 2015 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

రెస్టాఫ్ ఇండియా 264 ఆలౌట్

రెస్టాఫ్ ఇండియా 264 ఆలౌట్

కర్ణాటకతో ఇరానీ కప్ మ్యాచ్
బెంగళూరు: ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియాకు 20 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కర్ణాటకతో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు బుధవారం రెస్ట్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకు ఆలౌటైంది. కేదార్ జాదవ్ (106 బంతుల్లో 78; 13 ఫోర్లు) అర్ధ సెంచరీ మినహా మిగతా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. కర్ణాటక బౌలర్లలో మిథున్, గోపాల్, వినయ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం కర్ణాటక ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 39 పరుగులు చేసింది. ఫలితంగా ఆ జట్టు ప్రస్తుతం 19 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement