ఇరానీ ట్రోఫీ 2023లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు స్వల్ప ఆధిక్యం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌరాష్ట్ర.. రెస్ట్ ఆఫ్ ఇండియా స్కోర్‌కు 96 పరుగులు వెనుకపడి ఉంది.
ఐదేసిన పార్థ్ భట్..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32), హనుమ విహారి (33), శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32), సౌరభ్ కుమార్ (39) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్ పార్థ్ భట్ 5 వికెట్లతో రెస్ట్ ఆఫ్ ఇండియాను దెబ్బకొట్టాడు. ధరేంద్ర జడేజా (3/20), యువరాజ్ సింగ్ దోడియా (2/74) తలో చేయి వేశారు.
సౌరాష్ట్రను దెబ్బకొట్టిన కావేరప్ప, సౌరభ్ కుమార్..
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్రను విధ్వత్ కావేరప్ప (3/28), సౌరభ్ కుమార్ (3/64) దెబ్బకొట్టారు. వీరిద్దరికి షమ్స్ ములానీ (2/46), పుల్కిత్ నారంగ్ (1/56) తోడవ్వడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. హార్విక్ దేశాయి (0), చిరాగ్ జానీ (2), షెల్డన్ జాక్సన్ (13), జడేజా (11) విఫలం కాగా.. సమర్థ్ వ్యాస్ (29), చతేశ్వర్ పుజారా (29), ప్రేరక్ మన్కడ్ (29), పార్థ్ భట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో అర్పిత్ వసవద (54) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. జడదేవ్ ఉనద్కత్ (17), దోడియా (0) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment