ఇరానీ ట్రోఫీ 2023లో తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం నడిచింది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర బౌలర్లు హవా కొనసాగించారు. పార్థ్ భట్ (4/85), ధరేంద్ర సింగ్ జడేజా (2/89), యువరాజ్ సింగ్ దోడియా (2/74) రాణించారు. వీరి ధాటికి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి రోజే 8 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
రాణించిన సాయి సుదర్శన్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఓపెనర్లు సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం మాయంక్ ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన హనుమ విహారి (33) సైతం ఓ మోస్తరు స్కోర్ చేసి ఔటయ్యాడు.
సర్ఫరాజ్ ఖాన్ (17), యశ్ ధుల్ (10), పుల్కిత్ నారంగ్ (12) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరభ్ కుమార్ (30), నవదీప్ సైనీ (8) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఇరానీ ట్రోఫీ రంజీ ఛాంపియన్ టీమ్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుతుందన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment