సౌరాష్ట్ర 380 ఆలౌట్‌.. రెస్టాఫ్‌ ఇండియా టార్గెట్‌ 104 పరుగులు | Irani Cup 2022: Saurastra Vs Rest Of India Match | Sakshi
Sakshi News home page

Irani Cup 2022: సౌరాష్ట్ర 380 ఆలౌట్‌.. రెస్టాఫ్‌ ఇండియా టార్గెట్‌ 104 పరుగులు

Published Tue, Oct 4 2022 9:48 AM | Last Updated on Tue, Oct 4 2022 10:15 AM

Irani Cup 2022: Saurastra Vs Rest Of India Match - Sakshi

రాజ్‌కోట్‌: ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్ర రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా ముందు 104 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆటకు రెండు రోజుల సమయం మిగిలి ఉండడంతో రెస్టాఫ్‌ ఇండియా విజయం దాదాపు ఖాయమే. ఇక ఓవర్‌నైట్‌ స్కోరు 368/8తో నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్ర మరో 12 పరుగులు మాత్రమే చేసి 380 పరుగులకు ఆలౌట్‌ అయింది.

జైదేవ్‌ ఉనాద్కట్‌ 89 పరుగులు చేసి ఔట్‌ కాగా.. మిడిలార్డర్‌లో షెల్డన్‌ జాక్సన్‌ (71; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అర్పిత్‌ (55; 7 ఫోర్లు, 1 సిక్స్‌), లోయర్‌ ఆర్డర్‌లో ప్రేరక్‌ మన్కడ్‌ (72; 9 ఫోర్లు) రాణించారు. దీంతో సౌరాష్ట్రకు 104 పరుగుల ఆధిక్యం లభించింది.  రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా బౌలర్లలోకుల్దీప్‌ సేన్‌ ఐదు వికెట్లు తీయగా..  సౌరభ్ 3 వికెట్లు తీశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement