ఇరానీ కప్ విజేత కర్ణాటక | karnatka won irani cup | Sakshi
Sakshi News home page

ఇరానీ కప్ విజేత కర్ణాటక

Published Thu, Feb 13 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM

ఇరానీ కప్ విజేత కర్ణాటక

ఇరానీ కప్ విజేత కర్ణాటక

బెంగళూరు: రంజీ ట్రోఫీ విజేత కర్ణాటక.. ఇరానీ కప్‌నూ కైవసం చేసుకుంది. లెగ్‌స్పిన్నర్ ఎస్.గోపాల్ (5/35) కెరీర్‌లో తొలిసారి హ్యాట్రిక్ సాధించడంతో రెస్టాఫ్ ఇండియాపై కర్ణాటక ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓవర్‌నైట్‌స్కోరు 114/3తో నాలుగో రోజు బుధవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రెస్ట్ జట్టు... గోపాల్‌కు తోడు వినయ్‌కుమార్ (4/70) 57.5 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది.
 
  అపరాజిత్ (66) ఒంటరిపోరాటం చేసినా ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. 58వ ఓవర్లో గోపాల్ వరుసగా అపరాజిత్ (66), అశోక్ దిండా (0), పంకజ్‌సింగ్ (0)లను ఔట్‌చేసి మరో రోజు ఆట మిగిలివుండగానే రెస్ట్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.  కర్ణాటక కెప్టెన్ వినయ్‌కుమార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
 
 సంక్షిప్త స్కోర్లు:
 రెస్టాఫ్ ఇండియా: 201 - 183
 కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 606
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement