ఇరానీ ట్రోఫీ-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. తాజాగా ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఈ జట్టుకు టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది.
అయితే దులీప్ ట్రోఫీలో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్‌కు మాత్రం బీసీసీఐ సెలక్టర్లు మొండి చేయిచూపించింది. అతడికి ఇరానీ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వలేదు. అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత క్రికెటర్లు ధ్రువ్ జురెల్, యష్ దయాల్‌ను ఈ జట్టులో సెలెక్టర్లు చేర్చారు. దీంతో వీరిద్దరూ రెండు టెస్టుకు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. మరోవైపు ఈ ఇరానీ కప్‌లో ముంబై జట్టుకు సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు.
ఇరానీ ట్రోఫీకి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, సరాంశ్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, యష్ దయాల్*, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్
చదవండి: ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నాం.. ట్రోఫీ మాదే: హర్మన్
Comments
Please login to add a commentAdd a comment