కర్ణాటకదే ఇరానీ కప్
బెంగళూరు: దేశవాళీ టోర్నీల్లో కర్ణాటక జట్టు హవా కొనసాగుతోంది. రంజీ ట్రోఫీలాగే ఇరానీ కప్‌నూ నిలబెట్టుకుంది. రెస్టాఫ్ ఇండియాతో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఇరానీ కప్ ఫైనల్లో కర్ణాటక 246 పరుగులతో ఘన విజయం సాధించింది. 403 పరుగుల విజయలక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన రెస్ట్ జట్టు 43.3 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది.
జాదవ్ (56) మినహా అందరూ విఫలమయ్యారు. స్పిన్నర్ గోపాల్ నాలుగు, మిథున్ మూడు వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు కర్ణాటక తమ రెండో ఇన్నింగ్స్‌లో 422 పరుగులకు ఆలౌటయింది. మనీష్ పాండే (123 నాటౌట్) సెంచరీ చేశాడు. ముంబై తర్వాత ఇరానీకప్‌ను రెండు సార్లు గెలిచిన జట్టు కర్ణాటక కావడం విశేషం.