
రవీంద్ర జడేజా
సాక్షి, హైదరాబాద్: జాతీయ జట్టులో చోటు కోల్పోయిన స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగాడు. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జార్ఖండ్‌తో జింఖానా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో జడేజా (116 బంతుల్లో 113 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో సౌరాష్ట్రను గెలిపించాడు. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 48.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసి విజయం సాధించింది.
సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప (17 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), చతేశ్వర్ పుజారా (44; 6 ఫోర్లు), చిరాగ్ (46 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా రాణించారు. ఐదో వికెట్‌కు చిరాగ్‌తో కలిసి జడేజా 114 పరుగులు జతచేశాడు. అంతకుముందు జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 329 పరుగులు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (93; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీని చేజార్చుకున్నాడు. సౌరాష్ట్ర బౌలర్లలో జైదేవ్ ఉనాద్కట్, చిరాగ్, శౌర్య రెండేసి వికెట్లు తీశారు. గ్రూప్ ‘డి’లోనే భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ 45 పరుగులతో విదర్భపై, జమ్మూ కశ్మీర్ ఐదు వికెట్లతో సర్వీసెస్‌పై గెలుపొందాయి.
Comments
Please login to add a commentAdd a comment