hazare trophy
-
సౌరాష్ట్రను గెలిపించిన జడేజా
సాక్షి, హైదరాబాద్: జాతీయ జట్టులో చోటు కోల్పోయిన స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగాడు. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జార్ఖండ్‌తో జింఖానా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో జడేజా (116 బంతుల్లో 113 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో సౌరాష్ట్రను గెలిపించాడు. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 48.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసి విజయం సాధించింది. సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప (17 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), చతేశ్వర్ పుజారా (44; 6 ఫోర్లు), చిరాగ్ (46 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా రాణించారు. ఐదో వికెట్‌కు చిరాగ్‌తో కలిసి జడేజా 114 పరుగులు జతచేశాడు. అంతకుముందు జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 329 పరుగులు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (93; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీని చేజార్చుకున్నాడు. సౌరాష్ట్ర బౌలర్లలో జైదేవ్ ఉనాద్కట్, చిరాగ్, శౌర్య రెండేసి వికెట్లు తీశారు. గ్రూప్ ‘డి’లోనే భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ 45 పరుగులతో విదర్భపై, జమ్మూ కశ్మీర్ ఐదు వికెట్లతో సర్వీసెస్‌పై గెలుపొందాయి. -
ఆంధ్ర అదిరే ఆట
చెన్నై: రంజీ ట్రోఫీలో నాకౌట్ దశకు చేరే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన ఆంధ్ర క్రికెట్ జట్టు దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం జోరు మీదుంది. పటిష్టమైన తమిళనాడుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర 29 పరుగుల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో ఆంధ్రకిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. తాజా గెలుపుతో ఆంధ్ర 16 పాయింట్లతో గ్రూప్ ‘సి’లో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 276 పరుగులు చేసింది. ఓపెనర్ శ్రీకర్ భరత్ (85 బంతుల్లో 82; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), రికీ భుయ్ (51 బంతుల్లో 52; ఒక ఫోర్, 3 సిక్స్‌లు), బోడపాటి సుమంత్ (67 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అశ్విన్ హెబర్ (38; 4 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు భరత్ 87 పరుగులు జోడించాడు. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 48.5 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఆంధ్ర బౌలర్లలో శివ కుమార్ (2/53), అయ్యప్ప (2/37), భార్గవ్ భట్ (2/46), విహారి (2/41) రెండేసి వికెట్లు తీశారు. సోమవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌తో ఆంధ్ర తలపడుతుంది. -
యువరాజ్ జోరు
న్యూఢిల్లీ: డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (95 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు; 2 సిక్స్) దేశవాళీ టోర్నీల్లో తన సూపర్ ఫామ్‌ను చాటుకుంటున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ చెలరేగి అజేయ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించాడు. నార్త్ జోన్లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 49.1 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. గంభీర్ (8), సెహ్వాగ్ (10) మరోసారి పేలవ ఆటతీరును ప్రదర్శించారు. అనంతరం పంజాబ్ 47 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసి గెలిచింది. స్వల్ప విరామంలోనే వికెట్లు పడినప్పటికీ గుర్కీరత్ సింగ్ (53 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి యువరాజ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తన ట్రేడ్‌మార్క్ షాట్స్ కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్లతో విరుచుకుపడ్డాడు. ఓ భారీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించిన యువీ నాలుగో వికెట్‌కు అజేయంగా 143 పరుగులు జత చేశాడు.