యువరాజ్ జోరు
న్యూఢిల్లీ: డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (95 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు; 2 సిక్స్) దేశవాళీ టోర్నీల్లో తన సూపర్ ఫామ్‌ను చాటుకుంటున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ చెలరేగి అజేయ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించాడు.
నార్త్ జోన్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 49.1 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. గంభీర్ (8), సెహ్వాగ్ (10) మరోసారి పేలవ ఆటతీరును ప్రదర్శించారు. అనంతరం పంజాబ్ 47 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసి గెలిచింది.
స్వల్ప విరామంలోనే వికెట్లు పడినప్పటికీ గుర్‌కీరత్ సింగ్ (53 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి యువరాజ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తన ట్రేడ్‌మార్క్ షాట్స్ కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్‌లతో విరుచుకుపడ్డాడు. ఓ భారీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించిన యువీ నాలుగో వికెట్‌కు అజేయంగా 143 పరుగులు జత చేశాడు.