Young Saurashtra Cricketer Avi Barot Dies: క్రీడా ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. సౌరాష్ట్ర యువ బ్యాటర్ అవి బరోట్ మరణించాడు. 29 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశాడు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్‌సీఏ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ‘‘ఈ వార్త విని ప్రతి ఒక్కరం దిగ్భ్రాంతికి గురయ్యాం. అవి బరోట్ అక్టోబరు 15 సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. సౌరాష్ట్ర క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది’’ అని బాధాతప్త హృదయంతో మీడియాకు ప్రకటన విడుదల చేసింది.
కాగా కుడిచేతి వాటం గల అవి బరోట్... అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్(2011)గా వ్యవహరించాడు. 2019-20 సీజన్‌కు గానూ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. బరోట్ 38 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 38 లిస్ట్-ఏ, 20 దేశవాళీ టీ20 మ్యాచ్‌లలో భాగస్వామ్యమయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన బరోట్... ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 1547 పరుగులు, లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 1030, టీ20లలో 717 పరుగులు చేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 122 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా అవీ బరోట్ ఆకస్మిక మరణం పట్ల ఎస్‌సీఏ అధ్యక్షుడు జయదేవ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బరోట్ ఎంతో మంచి వాడని, అతడు లేడన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు.
చదవండి: Team India Coach: రాహుల్ ద్రవిడ్ ఒప్పేసుకున్నారు.. ఇకపై హెడ్ కోచ్‌గా?!
Comments
Please login to add a commentAdd a comment