
న్యూఢిల్లీ: సౌరాష్ట్ర మాజీ క్రికెటర్, బీసీసీఐ రిఫరీ రాజేంద్రసిన్హ్ జడేజా(66) కరోనా కాటుకు బలయ్యారు. ఆదివారం ఉదయం ఆయన మహమ్మారితో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ధృవీకరించింది. క్రికెటర్‌గా, కోచ్‌గా, రిఫరీగా వివిధ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించిన జడేజా మృతి చెందడం బాధకరమని, అతని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
పాతతరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరు గాంచిన జడేజా.. 1974-1987 మధ్యకాలంలో 50 ఫస్ట్క్లాస్మ్యాచ్లు, 11 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 1640 పరుగులతో పాటు 145 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కొంతకాలం పాటు సౌరాష్ట్ర కోచ్‌గా, మేనేజర్‌గా, సెలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన జడేజా.. బీసీసీఐ అధికారిక రిఫరీగా కూడా వ్యవహరించాడు. 53 ఫస్ట్క్లాస్మ్యాచ్లు, 18 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 34 టీ20 మ్యాచ్‌లకు అతను మ్యాచ్ రిఫరీగా పని చేశారు. జడేజా మృతి పట్ల బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా, ప్రస్తుత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జైదేవ్ షా సంతాపం వ్యక్తం చేశారు.
చదవండి: ప్రముఖ నటితో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడి ప్రేమాయణం..?