
విజయ్ హజారే ట్రోఫీ
న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో అద్భుత ఆటతీరు కనబరుస్తున్న కర్ణాటక, సంచలనాల సౌరాష్ట్ర మధ్య మంగళవారం ఇక్కడ దేశవాళీ ప్రతిష్ఠాత్మక వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ జరగనుంది. రెండు జట్ల బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. టోర్నీలో 633 పరుగులు సాధించిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో పాటు కెప్టెన్ కరుణ్ నాయర్, ఆల్‌రౌండర్‌లతో కర్ణాటక ఫేవరెట్‌గా కనిపిస్తున్నా... రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా వంటి ఆటగాళ్లున్న సౌరాష్ట్రను తక్కువ అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో ఆసక్తికర పోరుకు అవకాశం ఉంది.
► ఉదయం గం. 9.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం