సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఒడిశా బోణీ చేసింది. గ్రూప్-బిలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఒడిశా 32 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒడిశా బౌలర్ సూర్యకాంత్ ప్రధాన్ (3/37, 5/69) 8 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదివారం 96/5 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర 101 ఓవర్లలో 179 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ సాగర్ (68) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, లోయర్ ఆర్డర్‌లో అర్పిత్ వసావ్డా (45) రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ప్రధాన్ బౌలింగ్ ధాటికి విలవిలలాడారు. అతనితో పాటు కీలక సమయంలో ధీరజ్ సింగ్ 2 పడగొట్టగా... దీపక్, సమంత్రే చెరో వికెట్ పడతీశారు. తొలి ఇన్నింగ్‌సల్లో ఒడిశా 228, సౌరాష్ట్ర 186 పరుగులు చేశాయి.
సౌరాష్ట్రపై ఒడిశా గెలుపు
Published Mon, Oct 17 2016 10:42 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
Advertisement
Advertisement