
రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షో
టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన రవీంద్ర జడేజా రంజీ ట్రోఫీలో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు.
రాజ్ కోట్: టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన రవీంద్ర జడేజా రంజీ ట్రోఫీలో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. సౌరాష్ట్ర తరుపున ఆడుతున్నజడేజా అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ ఆకట్టుకున్నాడు. గ్రూప్ సి లో భాగంగా గురువారం ఇక్కడ జార్ఖండ్- సౌరాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ ను 168 పరుగులకే ఆలౌట్ చేయడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. 71 పరుగులకు ఆరు వికెట్లు తీసి జార్ఖండ్ వెన్నువిరిచాడు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన సౌరాష్ట్ర ఆదిలో తడబడినా జడేజా ఆదుకున్నాడు. సౌరాష్ట్ర వరుసగా వికెట్ల కోల్పోతున్న తరుణంలో జడేజా తనవంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించి హాఫ్ సెంచరీ చేశాడు. 75 బంతులో 58 పరుగులతో జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆలౌటైన సౌరాష్ట్రకు 37 పరుగుల ఆధిక్యం లభించింది.