రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ సెమీఫైనల్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. సౌరాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీస్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (249), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (55) చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి కేవలం 3 పరుగుల ఆధిక్యంలో ఉంది. నికిన్ జోస్ (54) అజేయమైన హాఫ్‌సెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు.
మ్యాచ్ చివరి రోజు కర్ణాటక వేగంగా ఆడి కనీసం 250 పరుగుల టార్గెట్ సౌరాష్ట్రకు నిర్ధేశిస్తే కానీ గెలిచే అవకాశాలు లేవు. ఇలా జరగక మ్యాచ్ డ్రాగా ముగిస్తే, తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరుతుంది. మయాంక్ డబుల్ సెంచరీ, శ్రీనివాస్ శరత్ (66) హాఫ్ సెంచరీతో రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకే ఆలౌట్ కాగా.. కెప్టెన్ వసవద (202) డబుల్ హండ్రెడ్, షెల్డన్ జాక్సన్ (160) భారీ శతకంతో చెలరేగడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 527 పరుగులకు ఆలౌటైంది.
తొలి సెమీస్ విషయానికొస్తే.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగాల్ పూర్తి ఆధిక్యం సంపాదించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 547 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 279/9 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 438 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 170 పరుగులకే చేతులెత్తేసింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో సుదీప్ ఘర్మానీ (112), మజుందార్ (120) సెంచరీలతో చెలరేగగా.. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సరాన్ష్ జైన్ (65) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా బెంగాల్ ఫైనల్‌కు చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment