
రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర, వెస్ట్ బెంగాల్ మధ్య ప్రారంభమైన ఫైనల్ తొలిరోజే ఆసక్తికరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 174 పరుగులకే ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో బెంగాల్ జట్టు తక్కువస్కోరుకే పరిమితమైంది. టాపార్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమైనప్పటికి.. లోయర్ ఆర్డర్‌లో షాబాజ్ అహ్మద్ 69, అభిషేక్ పొరెల్ 50 పరుగులు చేయడంతో బెంగాల్ స్కోరు 170 అయినా దాటింది.
ఉనాద్కట్, చేతన్ సకారియా చెరో మూడు వికెట్లు తీయగా.. చిరాగ్ జానీ, డీఏ జడేజాలు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ 38, చేతన్ సకారియా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment