Prerak Mankad(PC: BCCI)
Saurashtra Won: విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్‌లో సౌరాష్ట్ర అదరగొట్టింది. జయదేవ్ ఉనద్కట్ సారథ్యంలోని జట్టు... విదర్భను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ప్రేరక్ మన్కడ్ హాఫ్ సెంచరీ(72 బంతుల్లో 77 పరుగులు, 10 ఫోర్లు, 2 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ మూడో క్వార్టర్ ఫైనల్‌లో భాగంగా సౌరాష్ట్ర- విదర్భ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న సౌరాష్ట్ర.... 150 పరుగులకే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసింది.
జట్టులోని ప్రతి బౌలర్ కనీసం ఒక వికెట్ తీయడం విశేషం. ఈ క్రమంలో 151 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌరాష్ట్ర... ఆదిలోనే విశ్వరాజ్ జడేజా వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ హర్విక్ దేశాయ్(9 పరుగులు) సైతం పూర్తిగా నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షెల్డన్ జాక్సన్ కూడా 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ప్రేరక్ మన్కడ్, అర్పిత్ వాసవడా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
వరుసగా 77, 41 పరుగులతో అజేయంగా నిలిచి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో సౌరాష్ట్ర విదర్భపై విజయం సాధించి సెమీస్ చేరుకుంది. విదర్భ బౌలర్లలో ఆదిత్య ఠాక్రేకు రెండు, లలిత్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి. అంతకుముందుబ్యాటర్ అపూర్వ్ వాంఖడే హాఫ్ సెంచరీ(72 పరుగులు) చేయడంతో విదర్భ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
స్కోర్లు: విదర్భ- 150 (40.3)
సౌరాష్ట్ర- 151/3 (29.5)
DO NOT MISS: Prerak Mankad's match-winning 77* (72) against Vidarbha 👍 👍
— BCCI Domestic (@BCCIdomestic) December 22, 2021
The Saurashtra right-hander creamed 10 fours & 2 sixes to power his side to a convincing 7-wicket win in the #QF3 of the #VijayHazareTrophy. 👏 👏 #SAUvVID
Watch his knock 🎥 🔽https://t.co/EVS1KXWGgV pic.twitter.com/iAQU5i8iJ9
Comments
Please login to add a commentAdd a comment