Ranji Trophy 2021-22: టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు బంతులు ఎదుర్కొన్న పుజారా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ముంబై బౌలర్ మోహిత్ అవస్తీ బౌలింగ్‌లో పుజారా ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. కాగా గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన పుజారాకి భారత జట్టులో చోటు దక్కడం ఇప్పటికే కష్టంగా మారింది. మార్చిలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు మరి కొద్దిరోజుల్లో జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది.
ఈ నేపథ్యంలో పుజారా డకౌట్ కావడం.. అతడు జట్టులోకి వచ్చే అవకాశాలను మరింత దెబ్బతీశాయి. ఇక పుజారా 2018-19 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన పుజారా 521 పరుగులు చేశాడు. అయితే అప్పటి నుంచి పుజారా తన ఫామ్‌ను కోల్పోయాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 27 టెస్టులాడిన పుజారా కేవలం 1287 పరుగుల మాత్రమే చేశాడు. లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై అత్యధికంగా 91 పరుగులు పుజారా సాధించాడు.
చదవండి: Ind Vs Wi 2nd T20: రోహిత్ ఆగ్రహం... అసహనంతో బంతిని తన్నిన హిట్‌మ్యాన్.. పాపం భువీ!
Comments
Please login to add a commentAdd a comment