సౌరాష్ట్ర 419 ఆలౌట్‌  | Saurashtra All Out For 419 Against Andhra Team | Sakshi
Sakshi News home page

సౌరాష్ట్ర 419 ఆలౌట్‌ 

Published Sat, Feb 22 2020 2:10 AM | Last Updated on Sat, Feb 22 2020 2:10 AM

Saurashtra All Out For 419 Against Andhra Team - Sakshi

సాక్షి, ఒంగోలు: తొలి రోజు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన ఆంధ్ర బౌలర్లు రెండో రోజు లయ తప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్‌ చిరాగ్‌ జానీ (121; 12 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో... ఇక్కడి సీఎస్‌ఆర్‌ శర్మ కాలేజి మైదానంలో జరుగుతోన్న రంజీ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 226/6తో శుక్రవారం ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర చివరి 4 వికెట్లకు మరో 193 పరుగులు జోడించింది. ప్రేరక్‌ మన్కడ్‌ (80; 8 ఫోర్లు) రాణించాడు. యెర్రా పృథ్వీరాజ్, కేవీ శశికాంత్‌ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం జ్ఞానేశ్వర్‌ (22 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఆంధ్ర మరో 379 పరుగులు వెనుకబడి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement