బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా జయదేవ్ ఉనాద్కట్
Ranji Trophy 2022-23- Saurashtra vs Delhi: భారత లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ రంజీ ట్రోఫీ టోర్నీలో సంచలనం సృష్టించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో వేసిన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు కూల్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు ఈ సౌరాష్ట్ర కెప్టెన్. మూడు, నాలుగు, ఐదో బంతికి వరుసగా ఢిల్లీ ఓపెనర్ ధ్రువ్ షోరే, వన్‌డౌన్ బ్యాటర్ వైభవ్ రావల్ సహా యశ్ ధుల్‌లను పెవిలియన్‌కు పంపాడు. ముగ్గురినీ డకౌట్ చేశాడు.
రంజీ చరిత్రలోనే తొలిసారి
కాగా రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి ఓవర్లోనే ఇలా హ్యాట్రిక్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇలా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్న జయదేవ్.. రెండో ఓవర్‌లోనూ విజృంభించాడు. వెంటనే మరో రెండు వికెట్లు తీశాడు. ఢిల్లీ బ్యాటర్లు లలిత్ యాదవ్(0), లక్ష్యయ్ తరేజా(1)లను అవుట్ చేశాడు.
అంతేకాదు..
తద్వారా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 21వ సారి.. ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చిన ఘనత సాధించాడు ఉనాద్కట్. ఆ తర్వాత జాంటీ సిద్ధు(4)ను కూడా పెవిలియన్‌కు పంపి మొత్తంగా ఆట మొదలైన గంటలోనే ఆరు వికెట్లు(మూడు ఓవర్లలో) తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతలాకుతలం చేశాడు. కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో జయదేవ్ ఇటీవలే భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కుదేలైన ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్
రంజీ ట్రోఫీ టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్- బిలో ఉన్న సౌరాష్ట్ర- ఢిల్లీ మధ్య మంగళవారం (జనవరి 3) మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ యశ్ ధుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఉనాద్కట్ దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఇందుకు తోడు, చిరాగ్ జానీ ఒక వికెట్, ప్రేరక్ మన్కడ్ ఒక వికెట్ తీశారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఢిల్లీ 8 వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది.
చదవండి: Hardik Pandya: స్లెడ్జింగ్‌తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు! మాట ఇస్తున్నా..
BCCI: బిగ్ ట్విస్ట్.. రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? చీఫ్ సెలక్టర్‌గా మళ్లీ అతడే!
Comments
Please login to add a commentAdd a comment