శతక్కొట్టిన రుతురాజ్‌.. 16 ఫోర్లు, 3 సిక్సర్లతో..! | Ranji Trophy 2022 23: Ruturaj Gaikwad Slams Hundred Vs Tamil Nadu | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2022-23: శతక్కొట్టిన రుతురాజ్‌.. 16 ఫోర్లు, 3 సిక్సర్లతో..!

Published Tue, Jan 10 2023 6:45 PM | Last Updated on Tue, Jan 10 2023 6:45 PM

Ranji Trophy 2022 23: Ruturaj Gaikwad Slams Hundred Vs Tamil Nadu - Sakshi

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా తమిళనాడుతో ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్‌లో మహారాష్ట్ర ఓపెనర్‌, టీమిండియా ప్లేయర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (126 బంతుల్లో 118; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతనితో పాటు గత మ్యాచ్‌ డబుల్‌ సెంచరీ హీరో కేదార్‌ జాదవ్‌ (56), అజిమ్‌ ఖాజీ (87 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో మహారాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. ]

అజీమ్‌ ఖాజీకి జతగా సత్యజీత్‌ బచ్చవ్‌ క్రీజ్‌లో ఉన్నాడు. మహారాష్ట్ర ఇన్నింగ్స్‌లో సిద్దేశ్‌ వీర్‌ (9), రాహుల్‌ త్రిపాఠి (7), సౌరభ్‌ నవాలే (5) విఫలం కాగా.. కెప్టెన్‌ అంకిత్‌ బావ్నే (45) పర్వాలేదనిపించాడు. తమిళనాడు బౌలర్లలో లక్ష్మీనారాయణన్‌ విఘ్నేశ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. సందీప్‌ వారియర్‌, రవి శ్రీనివాసన్‌ సాయి కిషోర్‌, విజయ్‌ శంకర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. అంతకుముందు అస్సాంతో జరిగిన మ్యాచ్‌ను మహారాష్ట్ర డ్రాగా ముగించగా.. ముంబైతో మ్యాచ్‌ను తమిళనాడు డ్రా చేసుకుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement