Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో టీమిండియా పరిమిత ఓవర్ల బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (80 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్ సాయంతో 90 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. కేరళతో ఇవాళే (డిసెంబర్ 20) మొదలైన మ్యాచ్‌లో రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దీపక్ హుడా (187 బంతుల్లో 133; 14 ఫోర్లు, సిక్స్) సెంచరీతో విరుచుకుపడ్డాడు. గత కొంతకాలంగా టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చెలరేగిపోతున్న ఈ ఇద్దరూ.. రంజీల్లోనూ తమ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నారు.
సూర్యకుమార్, దీపక్ హుడా రాణించడంతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు తొలి రోజు పూర్తి ఆధిపత్యం కొనసాగించాయి. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. హూడా సెంచరీతో, యశ్ కొఠారీ (58), సల్మాన్ ఖాన్ (62 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 2 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ థంపి, ఫజిల్ ఫనూస్, సిజోమోన్ జోసఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తొలి ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 457 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ (90) పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. యశస్వి జైస్వాల్ (162), కెప్టెన్ అజింక్య రహానే (139 నాటౌట్) సెంచరీలతో విజృంభించారు. హైదరాబాద్ బౌలర్లలో శశాంక్ 2 వికెట్లు పడగొట్టగా, కార్తీకేయ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment