
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా ఢిల్లీతో ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (81)తో పాటు కెప్టెన్ హనుమ విహారి (76 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (22), రికీ భుయ్ (9) నిరుత్సాహపరచగా విహారికి జతగా శ్రీకర్ భరత్ (7) క్రీజ్‌లో ఉన్నాడు.
ఢిల్లీ బౌలర్లలో దివిజ్ మెహ్రా, యోగేశ్ శర్మ, హృతిక్ షోకీన్ తలో వికెట్ పడగొట్టారు. ఇంతకుముందు మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు హైదరాబాద్‌పై 154 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా.. ఢిల్లీ టీమ్ సౌరాష్ట్ర చేతిలో ఇన్నింగ్స్ 214 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.